Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ లో పెరిగిన భూముల విలువ

తెలంగాణ లో పెరిగిన భూముల విలువ

వార్త 1 week ago

Telangana Land Value : తెలంగాణవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసేలా భూముల కొత్త మార్కెట్ విలువలు నేటి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చాయి.

2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం భూముల విలువలను సవరించడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ మార్పులకు అనుగుణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే తమ అధికారిక సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా అప్‌డేట్ చేసింది. దీనివల్ల ఇవాల్టి నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకునే ప్రతీ ఒక్కరికీ సవరించిన కొత్త ధరలే స్క్రీన్‌పై కనిపించనున్నాయి. ఈ మార్కెట్ విలువల సవరణ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 1,400 కోట్ల మేర ఆదాయం సమకూరవచ్చని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది.

Read Also : కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లపై కడియం శ్రీహరి విమర్శలు

మంత్రి పొంగులేటి స్పష్టత.. రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మార్పు లేదు!

భూముల మార్కెట్ విలువలు పెరిగినప్పటికీ, సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం భూముల ప్రభుత్వ విలువ (Market Value) మాత్రమే పెంచామని, రిజిస్ట్రేషన్ ఛార్జీల శాతాన్ని (Registration Charges) పెంచే యోచన ప్రభుత్వానికి ప్రస్తుతానికి లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే స్పష్టతనిచ్చారు. దీనివల్ల ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు, ఫ్లాట్ల విలువలు పెరిగినా.. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం చెల్లించే సేవా రుసుములు పాత పద్ధతిలోనే సాగనున్నాయి. ఇటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూనే, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పారదర్శకతను తీసుకురావడానికి ఈ సవరణలు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha