SI, Constable Preliminary Exam Dates : తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఛైర్మన్ వి.వి.శ్రీనివాస రావు పోలీస్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్ష తేదీలను ప్రకటించారు.
ఎస్సై, ఏఎస్సై పోస్టులకు నవంబర్ 29న మరియు కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 20న పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల కేంద్రాలతో పాటు దాదాపు 15 నుంచి 18 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
CM Revanth Reddy: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
SI, Constable Preliminary Exam Dates
SI, Constable Preliminary Exam Dates : మొత్తం ఖాళీలు & వచ్చిన దరఖాస్తులు
వివిధ శాఖల్లో ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి జులై 29న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఆగస్ట్ 19 నుండి సెప్టెంబర్ 16 వరకు 5,77,064 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల్లో 74.66% పురుషులు, 25.33% మహిళలు ఉన్నారు. బీసీలు అత్యధికంగా 49.19%, ఎస్సీ/ఎస్టీలు 43.60%, ఓసీలు (ఇతర రాష్ట్రాల 3.45%తో కలిపి) 7.20% మంది దరఖాస్తు చేసుకున్నారు. 56.84% మంది తెలుగు, 43.02% మంది ఇంగ్లీష్, 0.12% మంది ఉర్దూ మాధ్యమాన్ని ఎంచుకున్నారు. పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఒకరికి బదులు మరొకరు రాయడాన్ని నిరోధించడానికి మొదటిసారి ఆధార్ ఆధారిత 'ఫేస్ రెకగ్నిషన్' ముందస్తు ప్రక్రియను అమలు చేశారు. ఇప్పటికే 97.4% మంది అభ్యర్థులు దీనిని పూర్తి చేయగా, మిగిలిన వారికి ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు. అనంతరం అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
'రూ. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులన్నీ ఇస్తాం'.. సీఎం ఆరోపణలపై KTR సవాల్

