Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణ రాజకీయంలో 'TRS' వివాదం

తెలంగాణ రాజకీయంలో 'TRS' వివాదం

వార్త 3 days ago

BRS Objects on Kavitha Party Name :తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర వివాదం తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరుపై ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి (BRS) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘TRS’ అనే సంక్షిప్త నామం (Abbreviation) తమ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్నందున, ఆ పేరును మరే ఇతర పార్టీకి కేటాయించవద్దని డిమాండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Read Also: Ramchander Rao: ఓటర్ల జాబితా సవరణ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లపై రాంచందర్ రావు ఫైర్

BRS Objects on Kavitha Party Name

14 ఏళ్ల పోరాట సెంటిమెంట్.. ఈసీఐని ఆశ్రయించిన బీఆర్ఎస్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ‘TRS’ (తెలంగాణ రాష్ట్ర సమితి) అనే పేరు ప్రజల హృదయాల్లో బలంగా నాటుకుపోయిందని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేర్కొంది. తాము జాతీయ రాజకీయాల కోసం పార్టీ పేరును ‘బీఆర్ఎస్’గా మార్చినప్పటికీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలు తమను ‘టీఆర్ఎస్’గానే గుర్తిస్తున్నారని, ఈ తరుణంలో కవిత పార్టీకి అదే పేరు ఇస్తే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈసీఐకి కేవలం బీఆర్ఎస్ మరియు ఇతర అనుబంధ వర్గాల నుంచి ఏకంగా 700ల వరకు అభ్యంతరాలు అందడం గమనార్హం.

BRS Objects on Kavitha Party Name : ముందే దరఖాస్తు చేసుకున్న మహారాష్ట్ర నేతలు

కవిత తన పార్టీ పేరును ప్రకటించడానికి ఒక రోజు ముందే ‘TRS’ పేరు కోసం మహారాష్ట్రకు చెందిన నేతలు కొందరు ప్రయత్నించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. షోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ అనే నేత ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ (TRS) అనే పేరును కేటాయించాలని కోరుతూ ఈసీఐకి దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాల స్వీకరణ కోసం వారు పత్రికల్లో నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో పాటు మరో పార్టీ ‘తెలంగాణ రాజ్య సమితి’ కూడా కవిత పార్టీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 25న హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించిన కల్వకుంట్ల కవిత.. తన నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తూ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరును ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

జులై 2న తెలంగాణ ఉద్యమకారుల కోసం భూపోరాటం.. కవిత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha