TG SSC Results: తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ బుధవారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.
ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 16న పరీక్షలు ముగియగా, కేవలం కొద్ది రోజుల్లోనే స్పాట్ వాల్యూయేషన్, ట్యాబులేషన్ ప్రక్రియను పూర్తి చేసి, ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది.
Read Also:KTRను ఆ ఇద్దరు భామలు బాగా గుర్తుపెట్టుకుంటారు - చామల
Telangana Tenth Results Out.. Check Results on WhatsApp!
TG SSC Results: ఫలితాల గణాంకాలు
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఏప్రిల్ 25 నాటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావడంతో, బోర్డు యుద్ధ ప్రాతిపదికన స్కానింగ్ పనులను ముగించి ఫలితాలను సిద్ధం చేసింది. అనుకున్న సమయం కంటే ముందే ఫలితాలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ ద్వారా ఫలితాలు ఇలా తెలుసుకోండి:
ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం ఎస్సెస్సీ బోర్డు ఒక వినూత్న సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌సైట్‌ల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను చూసుకునే వెసులుబాటు కల్పించింది.
- ముందుగా మీ మొబైల్‌లో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్‌లో ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి.
- అనంతరం ‘SSC Results’ అని టైప్ చేసి, మీ హాల్‌టికెట్ నంబర్ పంపితే వెంటనే ఫలితాలు మీ మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అంతేకాకుండా, విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల.. విద్యార్థులకు సజ్జనార్ సూచనలు

