Dailyhunt
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఫిక్స్

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఫిక్స్

వార్త 2 weeks ago

Telangana School Summer Holidays: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవుల ప్రకటన చేసింది.ఏప్రిల్ నాలుగో వారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.సాధారణంగా జూన్ రెండో వారంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి (దీనిపై స్పష్టత రావాల్సి ఉంది).

నేటి (ఏప్రిల్ 1, 2026) నుంచే ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కావడం గమనార్హం.

Read Also: Drug Control: డ్రగ్స్ నిర్మూలనకు 'ఈగల్ వెబ్సైట్‌' విశేష కృషి

Telangana School Summer Holidays: పరీక్షా ఫలితాల దిశగా కసరత్తు

పరీక్షలు ముగియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది:ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ (దిద్దడం) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.పదో తరగతి పరీక్షలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. వేసవి సెలవులు ప్రారంభం కాకముందే లేదా సెలవుల మొదట్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.

 Telangana Schools Summer Holidays 2026

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ముందుగానే సెలవులను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. దీంతో విద్యార్థులకు ఏకంగా 48 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. వేసవి సెలవుల అనంతరం 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్నాయి.అదే విధంగా 2026-27 విద్యా సంవత్సరం వార్షిక అకడమిక్ క్యాలెండర్ ను ఖరారు చేసారు. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ సారి విద్యార్ధులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది.

    Read Also hindi news: hindi.vaartha.com

    Read Also Epaper : epaper.vaartha.com

    Read Also:

    తెలంగాణలో పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha