Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణకు కొత్త కళ.. రూ.1200 కోట్లతో తెరణ్యం బయోలాజిక్స్ ప్రారంభం

తెలంగాణకు కొత్త కళ.. రూ.1200 కోట్లతో తెరణ్యం బయోలాజిక్స్ ప్రారంభం

వార్త 1 month ago

Sangareddy News:సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం బోర్పట్ల గ్రామంలో రూ.1200 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన తెరణ్యం బయోలాజిక్స్ (Theranym Biologics) మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి మంత్రి దామోదర్ రాజనర్సింహా గారితో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు ఈ అత్యాధునిక ఫెసిలిటీలో క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఉత్పత్తి చేసి… యూఎస్ సహా పలు అంతర్జాతీయ దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

ఈ నూతన ఫెసిలిటీ ద్వారా సుమారు 1500 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. తెరణ్యం బయోలాజిక్స్ రాకతో లైఫ్ సైన్సెస్ రంగంలో “మేడ్ ఇన్ తెలంగాణ” బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయిలో మరింత పటిష్ఠం కానుందని ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ పేర్కొన్నారు

Read also: Medak News:మెదక్‌లో గోల్కొండ పాఠశాలలో ప్రీ ప్రైమరీ అడ్మిషన్లు ప్రారంభం

 Teranyam Biologics Inauguration

Sangareddy News:1500 మంది యువతకు ఉపాధి అవకాశాలు

ఈ సంస్థ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సుమారు 1500 మందికి నేరుగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ విలువ ప్రపంచవ్యాప్తంగా పటిష్టం కావడంతో, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

బోరంచలో రూ. 95 లక్షలతో కొత్త నీటి శుద్ధి కేంద్రం పనులు ప్రారంభం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha