TS DSP Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణవ్యాప్తంగా మొత్తం 36 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపీ (DGP) సీవీ ఆనంద్ సోమవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Also:Rythu Bharosa Funds Release:రేపు సాయంత్రం 4 గంటలకు రైతు భరోసా నిధులు విడుదల

TS DSP Transfers: వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు లైన్ క్లియర్.. తక్షణమే అమలు!
ఈ తాజా బదిలీల ఉత్తర్వులలో సుదీర్ఘకాలంగా ఎలాంటి లూప్ లైన్ లేదా పోస్టింగ్స్ లేకుండా డీజీపీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు ప్రాధాన్యత లభించింది. గత కొంతకాలంగా పోస్టింగ్స్ కోసం ఎదురుచూస్తున్న 28 మంది సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారులకు ఈ ఉత్తర్వుల ద్వారా విధుల్లోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న వివిధ సబ్-డివిజన్లు, విభాగాలు, స్పెషల్ వింగ్ లలోని స్థానాల్లో వీరికి కొత్త పోస్టింగులను కేటాయించారు. ఈ బదిలీల ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని, బదిలీ అయిన అధికారులు తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మరికొంత మంది పోలీస్ అధికారుల బదిలీలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.
Epaper: epaper.vaartha.com

