‘జనఆగ్రహ సభ’ పోస్టర్ను విడుదల చేసిన రాష్ట్ర పార్టీ చీఫ్ రాంచందర్రావు
ప్రధాని మోడీ సభకు భారీ ఏర్పాట్లు
Jana Agraha Sabha: తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ప్రజలు ఆశిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు.
మే 10వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించ తలపెట్టిన “జనఆగ్రహ సభ” పోస్టర్ను బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, రాష్ట్ర కార్యదర్శి భరత్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Telangana: శివంపేట పాఠశాల విద్యార్థుల ప్రభంజనం - SSC ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
Prime Minister’s visit poster released
Jana Agraha Sabha: ప్రధాని పర్యటన, అభివృద్ధి పనులు
పోస్టర్ విడుదల చేసిన అనంతరం ఎన్. రాంచందర్ మాట్లాడారు. మే 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్న సందర్భంగా, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభ జన ఆగ్రహ సభపోస్టర్ను ఆవిష్కరించామన్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రధాని పర్య టన ఏర్పాట్లు, వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో దాదాపు రూ. 7,700 కోట్ల నుంచి రూ.8,000 కోట్ల వరకు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
సభ ఉద్దేశ్యం, రాజకీయ విశ్లేషణ
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న జన ఆగ్రహ సభలో పాల్గొని ప్రజ లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని తొలిసారిగా తెలంగాణకు రావడం విశేషం అన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేయడం ఆనందంగా ఉందని, ఎయిర్పోర్టు వద్ద ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం సభా వేదికకు చేరుకుంటారని, తెలంగాణలో బిజెపి ఒక బలమైన ప్రత్యామ్నా యంగా ఎదుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, మహిళలు, యువతతో సహా అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు ఆకర్షితు లవు తున్నారు. దేశవ్యాప్తంగా బిజెపికి మద్దతు పెరుగుతుండగా, దక్షిణాదిలో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి.
ప్రతిపక్షాలపై విమర్శలు
రానున్న రోజుల్లో బిఆర్ ఎస్ పార్టీ ప్రజల సమస్యలను పూర్తిగా పక్కనపెట్టి, కుటుంబ ప్రయో జనాలకే పరిమితమైపోయింది. ఇటువంటి అవకాశవాద రాజకీయాలు ఇక తెలంగాణలో పనిచేయవు. అందుకే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా ఈ సభకు జన ఆగ్రహసభ అనినా మకరణం చేయ డం జరిగింది.. ఈసభకు మేధావులు, యువత, మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలకాలని కోరుతున్నాను. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో బిజెపి విజయాన్ని సాధిస్తుం దని, పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తుందని విశ్వసిస్తున్నామని అన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో తెలంగాణ లో బిజెపి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేలా ప్రజలు ఆశీర్వదించాలని కోరుతున్నాను. బిఆర్ఎస్ పాలనలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళల పట్ల, యువత పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల నిరక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ: అధికారులకు స్థల పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం

