Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వివరాలు వెల్లడించిన మంత్రి

తెలంగాణలో మరో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వివరాలు వెల్లడించిన మంత్రి

వార్త 1 month ago

TG Greenfield Highway: హైదరాబాద్ నుంచి రామగుండం వరకు నూతన గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

ఈ ప్రతిపాదిత రహదారిలో సుల్తానాబాద్ బైపాస్‌ను కూడా చేర్చి మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మంథని నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, పనులన్నింటినీ రాబోయే 18 నెలల్లో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రేపల్లి గ్రామంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబుతో కలిసి రూ.384 కోట్ల విలువైన హ్యామ్ (HAM), నాన్-ప్లాన్ రోడ్డు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

Read Also: Rajiv Gandhi's 82nd Birth Anniversary : రాజీవ్ గాంధీ 82 వ జయంతి సందర్బంగా విగ్రహానికి ఘన నివాళి

 Another new greenfield highway in Telangana… Minister reveals details.

TG Greenfield Highway: రహదారుల అభివృద్ధి, నిధుల కేటాయింపు

పరిశ్రమల విస్తరణ, వ్యాపార పురోగతి, యువతకు ఉపాధి అవకాశాలు పెరగడానికి నాణ్యమైన రహదారులు అత్యంత కీలకమని మంత్రులు పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ (R&B), పంచాయతీ రాజ్ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా రూ.30 వేల కోట్లతో రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల విలువైన బిల్లులను పెండింగ్‌లో పెట్టినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోందని వెల్లడించారు.

పెద్దపల్లి బైపాస్, ఇతర ప్రాజెక్టులు

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, గత పదేళ్లలో పెద్దపల్లి జిల్లాలో కేవలం రూ.900 కోట్ల రోడ్డు పనులు మాత్రమే జరిగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే రూ.1,700 కోట్ల విలువైన పనులను మంజూరు చేసిందని తెలిపారు. గతంలో నిధులు వెనక్కి వెళ్లిన పెద్దపల్లి బైపాస్ ప్రాజెక్ట్‌ను రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తిరిగి ప్రారంభించామని, ఇప్పటికే రూ.80 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక వసతుల రూపురేఖలను మార్చడమే లక్ష్యంగా మంథని, సుల్తానాబాద్‌ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు.

Epaper: epaper.vaartha.com

ప్రభుత్వ ధనంతో 'ఉచిత' పథకాలా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha