Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana polling live : తెలంగాణలో పోలింగ్ మొదలు, నగరాల్లో హై అలర్ట్!

Telangana polling live : తెలంగాణలో పోలింగ్ మొదలు, నగరాల్లో హై అలర్ట్!

వార్త 4 months ago

Telangana polling live : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకే ఓటింగ్ ప్రక్రియ మొదలై రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2,582 వార్డుల్లో 12 వార్డులు ఏకగ్రీవంగా తేలగా, ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఓటర్లు సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఓటర్ల సౌకర్యార్థం మున్సిపాలిటీ పరిధిలో 6,017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని 414 వార్డుల్లో రెండు వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 412 వార్డుల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం 2,174 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

Yash: 'టాక్సిక్' మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 52,17,413గా ఉంది. ఇందులో పురుషులు 25,49,750 మంది, మహిళలు 26,67,025 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు. ఈ నెల 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, 16న చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుందని అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. అదనంగా 1,379 మంది రిటర్నింగ్ అధికారులను నియమించి, వెబ్‌కాస్టింగ్ కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికలు పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha