Dailyhunt
Yash: 'టాక్సిక్' మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

Yash: 'టాక్సిక్' మూవీ నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు?

వార్త 1 month ago

న్నడ స్టార్ హీరో యష్ (Yash) నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్' తాజాగా మరో వివాదంలో చిక్కుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని పీణ్య-జలహళ్లి సమీప అటవీ ప్రాంతంలో సినిమా షూటింగ్ సందర్భంగా అనుమతి లేకుండా వేలాది చెట్లను నరికివేశారనే ఆరోపణలు నిజమని కర్ణాటక అటవీ శాఖ తేల్చడంతో నిర్మాతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

షూటింగ్ యూనిట్‌తో పాటు భూమిని లీజుకు ఇచ్చిన వ్యక్తులపైనా కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Assets: సినిమాలే కాదు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న శర్వానంద్

భారీ స్పందన

ఈ సినిమాలో కియారా అడ్వాణీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. హుమా ఖురేషి, నటాలీ బర్న్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, క్యారెక్టర్ విజువల్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. యష్ (Yash) లుక్‌కు మాస్ ఆడియన్స్ నుంచి భారీ స్పందన రాగా, హీరోయిన్ క్యారెక్టర్ల ప్రెజెంటేషన్ కూడా డిఫరెంట్‌గా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Anil Ravipudi: కొత్త సినిమా ఊహాగానాలపై స్పందించిన దర్శకుడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha