Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టెలికాం, రైల్వే, పెట్రోల్ పేమెంట్లకు కేవలం రూ.5 ఫీజు!

టెలికాం, రైల్వే, పెట్రోల్ పేమెంట్లకు కేవలం రూ.5 ఫీజు!

వార్త 2 weeks ago

UPI Charges: యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త MDR (Merchant Discount Rate) విధానాన్ని ప్రకటించింది. అయితే ఈ మార్పుతో సాధారణ వినియోగదారులు నేరుగా ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.

వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) చేసే UPI లావాదేవీలు ఎంత మొత్తంలో ఉన్నా పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. అలాగే వ్యాపారులకు చేసే రూ.2,000 వరకు చెల్లింపులపైనా MDR ఉండదు.

Read Also :UPI ఆటోపేకు MDR వర్తించదు - కేంద్రం స్పష్టం

వ్యక్తి నుంచి వ్యక్తికి రూ.లక్ష పంపినా ఛార్జీ లేదు

ఉదాహరణకు రాజు తన స్నేహితుడు శ్రీనుకు UPI ద్వారా రూ.1 లక్ష పంపాడనుకుందాం. ఇది P2P లావాదేవీ కాబట్టి రాజుకు ఎలాంటి MDR లేదా ఇతర UPI ఛార్జీ వర్తించదు. అంటే UPI ద్వారా స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇతర వ్యక్తులకు డబ్బు పంపే విషయంలో మొత్తం ఎంత ఉన్నా అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం స్పష్టం చేసిన కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో P2P లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయి.

రూ.2,000 దాటితే వ్యాపారులకు MDR

వ్యాపారులకు చేసే P2M (Person-to-Merchant) UPI చెల్లింపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ ఉన్న లావాదేవీలకు 0.4% MDR వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ షాపింగ్ మాల్‌లో రూ.3,000 విలువైన వస్తువులు కొనుగోలు చేసి UPI ద్వారా చెల్లిస్తే, 0.4% ప్రకారం రూ.12 MDR వస్తుంది. ఈ రుసుము కస్టమర్ నుంచి వసూలు చేయాల్సింది కాదు; ఇది వ్యాపారి చెల్లింపు వ్యవస్థలో వర్తించే ఛార్జీ. అదే విధంగా రూ.50,000 విలువైన P2M లావాదేవీ జరిగితే 0.4% ప్రకారం రూ.200 MDR అవుతుంది.

రూ.75 వేలకుపైగా లావాదేవీలకు రూ.300 పరిమితి

అధిక విలువైన వ్యాపార లావాదేవీలపై MDRకు గరిష్ఠ పరిమితిని కూడా నిర్ణయించారు. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీకి ఒక్కో ట్రాన్సాక్షన్‌పై గరిష్ఠంగా రూ.300 MDR మాత్రమే వర్తిస్తుంది. దీంతో పెద్ద మొత్తాల చెల్లింపులపై 0.4% లెక్కన అపరిమితంగా ఛార్జీ పెరగకుండా పరిమితి ఉంటుంది.

టెలికాం, రైల్వే, ఇన్సూరెన్స్, ఫ్యూయల్‌కు ఫ్లాట్ రూ.5

కొన్ని కీలక రంగాలకు ప్రత్యేక MDR రేటును నిర్ణయించారు. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి ఎంపిక చేసిన రంగాల్లో జరిగే UPI చెల్లింపులకు 0.4% బదులు ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR వర్తిస్తుంది. అంటే ఈ కేటగిరీల్లో పేమెంట్ మొత్తం పెరిగినా, నిర్ణయించిన నిబంధనల ప్రకారం MDR రూ.5గానే ఉంటుంది.

స్టాక్ మార్కెట్ లావాదేవీలకు 0.02% MDR

మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్, స్టాక్ బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన క్యాపిటల్ మార్కెట్ చెల్లింపులకు MDRను మరింత తక్కువగా 0.02%గా నిర్ణయించారు. ఈ కేటగిరీలోనూ ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది.

చిన్న వ్యాపారులకు కూడా మినహాయింపు

చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, స్థానిక దుకాణాలకు అదనపు భారం పడకుండా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. UPI QR ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు స్వీకరించే అర్హత కలిగిన చిన్న వ్యాపారులకు జీరో MDR ఫ్రేమ్‌వర్క్ కొనసాగుతుంది.

కస్టమర్ల నుంచి MDR వసూలు చేయకూడదు

కొత్త విధానంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే MDRను కస్టమర్లపైకి బదిలీ చేయకూడదు. బ్యాంకులు వ్యాపారులు ఈ ఛార్జీని వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. UPI యాప్ ప్రొవైడర్లు కూడా దాచిన లేదా అదనపు ప్లాట్‌ఫామ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేశారు.

UPI Charges: 96 శాతం మర్చంట్ లావాదేవీలపై ప్రభావం ఉండదు

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్త MDR విధానం మొత్తం మర్చంట్ UPI లావాదేవీల్లో సుమారు 4 శాతం లావాదేవీలకే వర్తిస్తుంది. అంటే దాదాపు 96 శాతం మర్చంట్ లావాదేవీలు రూ.2,000 పరిమితి లేదా జీరో-MDR నిబంధనల కారణంగా ప్రభావితం కావు. మొత్తంగా చూస్తే, UPI ద్వారా వ్యక్తులకు డబ్బు పంపే వినియోగదారులకు ఎలాంటి మార్పు లేదు. రూ.2,000 వరకు చేసే సాధారణ మర్చంట్ చెల్లింపులు కూడా ఉచితంగానే ఉంటాయి. ప్రధానంగా రూ.2,000కు మించిన నిర్దిష్ట మర్చంట్ లావాదేవీలలోనే MDR వర్తిస్తుంది.

UPI పేమెంట్స్ పై ఛార్జీ.. యూజర్లలో ఆందోళన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha