Dailyhunt
తెల్లవారకుండానే తెల్లారిన బతుకులు!!

తెల్లవారకుండానే తెల్లారిన బతుకులు!!

వార్త 3 weeks ago

Markapuram Bus Tragedy: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద జరిగిన భీకర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, వారిలో అత్యధికులు బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వెళ్ళిన కూలీలే కావడం గమనార్హం.

శ్రీరామనవమి పండుగను తమ సొంత గ్రామాల్లో జరుపుకోవాలని ఆశగా బయలుదేరిన వారు, గమ్యస్థానానికి చేరువలో మృత్యుఒడికి చేరుకున్నారు.

Read Also :Markapuram bus accident: మార్కాపురం బస్సులో గ్యాస్ సిలిండర్.. ప్రమాదానికి కారణం అదేనా?

Markapuram Bus Tragedy:పండుగ పూట వలస కూలీల ఇళ్లలో తీరని చీకటి!

అయితే ఈ ప్రమాదంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్‌తో కలిసి ఇదే బస్సులో స్వగ్రామానికి వెళ్తుండగా మంటలను గమనించి కొడుకును బయటికి తోసేసింది. మంటలు ఎక్కువ కావడంతో తాను బస్సులోనే చిక్కుకుని, కొడుకు కళ్లెదుటే సజీవదహనమైంది.

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన భీకర బస్సు ప్రమాదం మరిన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హృదయాలను కలచివేస్తోంది. తన ఐదు నెలల పసికందును,భర్తను కళ్లెదుటే కోల్పోయిన ఆ మహిళ ఆవేదన వర్ణనాతీతంగా మారింది.దీంతో సదరు మహిళ గుండెలు అవిసేలా రోదిస్తోంది. స్వగ్రామానికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది

ఈ ప్రమాదంలో చోటుచేసుకున్న హృదయవిదారక గాథలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కనిగిరి మండలం చల్లగిరిగలకు చెందిన గర్భిణి రుక్మిణి, తన అమ్మమ్మ పిచ్చమ్మను కాపాడే ప్రయత్నంలో బస్సులోకి వెళ్లి సజీవ దహనమయ్యారు. తెలంగాణ నుండి కనిగిరికి వస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న గర్భిణి రుక్కు (25) మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వడంతో, ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా సజీవదహనమైంది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రుక్కు ఏడు నెలల గర్భిణి అని, కనిగిరిలోని తన పుట్టింటికి వెళుతున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే, జగిత్యాల నుంచి వస్తున్న రమాదేవి అనే తల్లి, మంటలు చుట్టుముట్టడంతో తన కుమారుడు మనోహర్ ప్రాణాలైనా దక్కాలని అతడిని కిటికీలోంచి బయటకు నెట్టేసి, తాను మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుపోయింది. కొడుకును రక్షించి తల్లి తనువు చాలించిన తీరు స్థానికులను కలచివేసింది.

 Markapuram Bus Tragedy: Mothers and Pregnant Women Who Sacrificed Their Lives: The Heartbreaking Tales of 14 People Burnt Alive

మరో ఘటనలో, కోరుట్ల సమీపంలోని రుద్రంగిలో స్థిరపడిన దేవండ్ల రామయ్య ఏటా నవమి ఉత్సవాలకు సొంతూరికి రావడం ఆనవాయితీ. కానీ ఈసారి బస్సు వెనుక సీట్లో కూర్చున్న ఆయనకు తప్పించుకునే మార్గం లేక ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డిలో ఉద్యోగం చేస్తున్న అనిల్, తన ఐదు నెలల కుమారుడు లియో కోసం మంటల్లోకి వెళ్లి తిరిగి రాలేకపోయారు. ఇలా ప్రతి మరణం వెనుక ఒక వెన్నాడుతున్న వ్యథాభరిత గాథ ఉంది.

టిప్పర్‌ను బస్సు ఢీకొనడంతో డీజిల్ ట్యాంకు పగిలి మంటలు వ్యాపించాయి

బస్సు ప్రమాదం నుంచి మొదటగా ప్రాణాలతో బయటపడింది తానేనని ట్రావెల్ బస్సు క్లీనర్ కనిగిరికి చెందిన మహేందర్రెడ్డి తెలిపాడు. ప్రమాద సమయంలో క్యాబిన్లో నిద్రపోతున్నానని, భారీ శబ్దం రావడంతో లేచి చూసేసరికే బస్సు మంటల్లో చిక్కుకుపోయిందన్నాడు. ‘మంటలు నియంత్రించే సిలిండర్లు ఉన్నప్పటికీ దట్టంగా పొగ వ్యాపించడంతో సమయానికి అక్కరకు రాలేదు. అద్దాలు పగలగొట్టుకొని కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నా. ఏడాదిగా హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో పనిచేస్తున్నా. ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి’ అని వివరించాడు.

ప్రమాద సమయంలో బస్సు అద్దాలు పగులగొట్టి ఎనిమిది మందిని కాపాడిన బాలరాజు అనే వ్యక్తి సాహసం చేసినా, మరికొందరిని రక్షించలేకపోయానని ఆవేదన చెందారు. టిప్పర్ ఆయిల్ ట్యాంకు పగిలి డీజిల్ అంతా బస్సుపై పడటంతో మంటలు క్షణాల్లో వ్యాపించాయి. సుమారు 200 నుంచి 300 డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు ఎగిసిపడటంతో సహాయక చర్యలు కూడా కష్టతరమయ్యాయి. పండుగ పూట వలస కూలీల జీవితాలు ఇలా బూడిదవ్వడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

బిడ్డను కాపాడి సజీవదహనమైన తల్లి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha