AP Heatwave alert: రాష్ట్రంలో ఎండలు మంటలు పుట్టిస్తున్నాయి. ప్రజలు ఇళ్లనుండి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
వడగాలులు విపరీతంగా విస్తున్నాయి. గురువారం వడగాడ్పులకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైంది. బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడ 47.6, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల శివారు తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6 నమోదైంది
Read also: AP Heatwave Alert: ఏపీలో నిప్పుల కొలిమి.. రేపు 50 డిగ్రీలు దాటనున్న ఉష్ణోగ్రతలు
AP Heatwave alert
AP Heatwave alert: సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం
పోలవరం జిల్లా కూన వరంలో 46.5, నెల్లూరు జిల్లా కావలిలో 46.4. గుంటూరు జిల్లా తెనాలిలో 46, తూర్పుగోదావరి జిల్లా బ్రహ్మణగూడెంలో 45.8, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 45.5, విశాఖ జిల్లా ములగాడలో 45.2, అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 45.1, కాకినాడ జిల్లా కందరాడ, విజయనగరం జిల్లా గుర్లలో 45 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బతో నలుగురు మృతి
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గీత కార్మికుడు దార్ల కృష్ణ (50) వడదెబ్బతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన రైతు కూనపరెడ్డి రామకృష్ణ (53) పొలంలో వడదెబ్బ తగిలి చనిపోయినట్లు రైతులు తెలిపారు. గుంటూరు నగరంలో ఆక్బర్ బాషా, విజయ వాడ నగరం సుందరయ్య నగర్ వెంకటేశ్వరరావులు వడ దెబ్బకు మరణించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వివత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 26, ప్రకాశం 23, కృష్ణా 22, ఏలూరు 21, బాపట్ల 20, ఎన్టీఆర్ 15, గుంటూరు 14, మార్కాపురం 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపిందని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బిపి ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచిం చారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

