Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఆర్ఎస్ పేరు ఎవరి సొంతం కాదు.. పాత పేరుతో కొత్త అజెండా

టీఆర్ఎస్ పేరు ఎవరి సొంతం కాదు.. పాత పేరుతో కొత్త అజెండా

వార్త 2 months ago

Kavitha's New Party: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తీసుకోబోయే తదుపరి అడుగు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు సంకేతాలిచ్చిన ఆమె, పార్టీ పేరు విషయంలో వస్తున్న ఊహాగానాలకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“తెలంగాణ రాష్ట్ర సమితి” (టీఆర్ఎస్) అనే పేరు ప్రస్తుతం ఎవరి చేతుల్లో లేదని, ఆ పేరును ఎవరైనా ఉపయోగించుకోవచ్చని ఆమె స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

Read Also: Hunting for marks : మార్కుల వేటలో మేధస్సుకు సంకెళ్లు!

 The name TRS does not belong to anyone.. Kavitha Clarity.

Kavitha’s New Party: టీఆర్ఎస్ పేరు ఎవరి సొంతం కాదు

మీడియాతో మాట్లాడిన కవిత, పాత పేరు, సరికొత్త అజెండాతో తాము ప్రజల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. పాతికేళ్ల క్రితం కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగానే ఉందని, అది ఎవరికీ సొంతం కాదని ఆమె గుర్తు చేశారు. తమ పార్టీ ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రాతిపదికన నడుస్తుందని, తమకు బీహార్ నుంచి వచ్చిన సిద్ధాంతకర్తలు ఎవరూ లేరని ఆమె పరోక్షంగా బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నిద్రావస్థలో ఉందని ఆమె ఎద్దేవా చేశారు.

ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై ఆగ్రహం

రాజకీయ అంశాలతో పాటు సామాజిక సమస్యలపై కూడా కవిత గళమెత్తారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే స్కూల్ యాజమాన్యాలు ఏకంగా 30 నుంచి 40 శాతం వరకు ఫీజులు పెంచడం మధ్యతరగతి తల్లిదండ్రులకు పెను భారంగా మారిందని ఆమె అన్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఏటా 8 నుంచి 10 శాతం వరకు మాత్రమే పెంచే అవకాశం ఉన్నా, భారీగా వసూళ్లు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటని విమర్శించారు.

తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని కోరారు. ప్రైవేటు స్కూళ్లపై ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ప్రైవేటు పాఠశాలలు 8 శాతం నుంచి 10 శాతం పెంచుకోవచ్చని, కానీ 30 నుంచి 35 శాతం పెంచితే ఎలాగని ప్రశ్నించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

'ఆహారభద్రత'ను హరిస్తున్న యుద్ధం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha