Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీచర్లకు గొప్ప శుభవార్త తెలుపబోతున్న ఏపీ సర్కార్

టీచర్లకు గొప్ప శుభవార్త తెలుపబోతున్న ఏపీ సర్కార్

వార్త 1 week ago

Govt Teachers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల పెన్షన్ సమస్యపై ప్రభుత్వం ఒక సానుకూల ముగింపు పలకబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

2002 మరియు 2003 ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికై, కొన్ని సాంకేతిక కారణాల వల్ల 2004 సంవత్సరం తర్వాత విధుల్లో చేరిన టీచర్లకు పాత పెన్షన్ విధానాన్ని (Old Pension Scheme – OPS) వర్తింపజేయాలని ఏపీ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (GO) త్వరలోనే వెలువడనున్నాయని సచివాలయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రభుత్వ అధికారిక ప్రకటన వస్తే గనుక, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11,000 మంది ఉపాధ్యాయులకు మరియు వారి కుటుంబాలకు ఎనలేని ఆర్థిక భద్రత చేకూరనుంది.

Read Also : గుడివాడలో అడుగు పెట్టే దమ్ముందా?.. నానికి వెనిగండ్ల సవాల్

ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటం.. సీపీఎస్ కంటే ముందే ఎంపికైనందున ఊరట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1వ తేదీ నుండి నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (Contributory Pension Scheme – CPS) అమల్లోకి వచ్చింది. అయితే, తాము ఈ నూతన విధానం రాకముందే, అంటే 2002, 2003 నోటిఫికేషన్ల ద్వారానే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి చేసుకుని అధికారికంగా పోస్టులకు ఎంపికయ్యామని సదరు ఉపాధ్యాయులు దశాబ్ద కాలంగా వాదిస్తున్నారు. కేవలం నియామక పత్రాల జారీ మరియు విధుల్లో చేరడం ఆలస్యం కావడం వల్ల తమకు పాత పెన్షన్ హక్కును నిరాకరించి, సీపీఎస్ పరిధిలోకి తీసుకురావడం అన్యాయమని ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ఆ ఉపాధ్యాయుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, వారి న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చేందుకు సిద్ధమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha