Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసిన లోకేశ్

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసిన లోకేశ్

వార్త 1 month ago

Nara Lokesh Working President TDP: మంగళగిరిలోని టీడబ్ల్యూపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

ముఖ్యంగా నారా లోకేశ్‌కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో తదుపరి తరం నాయకత్వానికి చంద్రబాబు స్పష్టమైన మార్గం సుగమం చేశారు.

Read Also:Annavaram Satyanarayana Swamy: అంగరంగ వైభవంగా సత్యదేవుని దివ్య కల్యాణం

Nara Lokesh Working President TDP: లోకేశ్‌కు పట్టాభిషేకం: బాధ్యతాయుతమైన పదవి

మంగళగిరిలో జరిగిన ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు పార్టీలోని కీలక నిర్ణయాలను వెల్లడించారు.మంత్రి నారా లోకేశ్‌ను టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాన్ని, యువతకు ఉద్యోగాల కల్పనలో ఆయన చూపిస్తున్న చొరవను చంద్రబాబు కొనియాడారు.గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఎన్నో ఈక్వేషన్లు, వడపోతల తర్వాతే ఈ కమిటీలను రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు. సీనియర్ల అనుభవానికి, యువత ఉత్సాహానికి సమాన ప్రాధాన్యతనిచ్చినట్లు పేర్కొన్నారు.

కార్యకర్తే అధినేత: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పార్టీ కోసం కష్టపడిన సామాన్యులకు కూడా ఉన్నత పదవులు దక్కాయని సీఎం వివరించారు.క్లస్టర్ ఇన్‌ఛార్జ్ స్థాయిలో ఉన్న వారికి కూడా పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించడం ద్వారా కార్యకర్తలే పార్టీకి బలమని నిరూపించారు.మహిళా బిల్లుకు మద్దతు ఇవ్వడంతో పాటు, కమిటీల్లో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. రామ్మోహన్ నాయుడు, శబిరి వంటి విద్యావంతులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చామని తెలిపారు..

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

44° దాటిన ఒంటిమిట్ట, కంభం.. 16 జిల్లాల్లో 42°కి పైగా ఉష్ణోగ్రతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha