Dailyhunt
టీఎంసీ అవినీతిపై 'వైట్ పేపర్' విడుదల చేస్తాం - మోదీ

టీఎంసీ అవినీతిపై 'వైట్ పేపర్' విడుదల చేస్తాం - మోదీ

వార్త 1 week ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బర్దమాన్ ప్రాంతంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసి, ఇది మే 4న రాబోయే ఫలితాలకు కేవలం 'ట్రైలర్' మాత్రమేనని ఆయన అభివర్ణించారు.

బెంగాల్‌లో టీఎంసీ భయానక పాలన ముగిసి, మార్పు రాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందని మోదీ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై పూర్తి వివరాలతో కూడిన 'వైట్ పేపర్' (శ్వేతపత్రం) విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రజల సొమ్మును దోచుకున్న ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని, అవినీతి వ్యవస్థను కూకటివేళ్లతో తొలగిస్తామని హామీ ఇచ్చారు.

Read Also: Modi Apology: మోదీ మహిళలకు క్షమాపణలు చెప్పాలి అంటూ కాంగ్రెస్ డిమాండ్

West Bengal Elections: మహిళలు మరియు రైతులకు భారీ వరాలు

ఓటర్లను ఆకట్టుకునేలా మోదీ పలు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు: మహిళా ఆర్థిక సహాయం: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రైతు సంక్షేమం: పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.9,000 కు పెంచుతామని, ముఖ్యంగా బంగాళదుంప రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అక్రమ చొరబాటుదారుల అంశంపై మోదీ కఠిన వైఖరిని ప్రదర్శించారు. చొరబాటుదారులు తమ సామాను సర్దుకుని వెళ్లాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు. అదే సమయంలో, సీఏఏ (CAA) ద్వారా మటువా, నమశూద్ర వంటి శరణార్థి వర్గాలకు పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేస్తామని, వారికి రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మహారాష్ట్ర హింగోలిలో భూకంపం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha