Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కొత్త విధానం.. పోలీస్ అభ్యర్థులకు యూనిక్ ఐడీ

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కొత్త విధానం.. పోలీస్ అభ్యర్థులకు యూనిక్ ఐడీ

వార్త 1 month ago

TSLPRB Unique ID: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక చర్యలు చేపడుతోంది.

పోటీ పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు లేకుండా చూసేందుకు ప్రతి అభ్యర్థి నియామక ప్రక్రియకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒకే చోట నిక్షిప్తం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థికి ఒక ప్రత్యేకమైన 'యూనిక్ ఐడీ' (Unique ID) ని కేటాయిస్తోంది.

Read Also: Kalvakuntla Kavitha: కవితతో తమిళనాడు జ్యోతిష్యుడి భేటీ!

 TSLPRB's new system: Unique ID for police candidates.

TSLPRB Unique ID: దరఖాస్తు నుంచి తుది ఎంపిక వరకు డిజిటల్ ట్రాకింగ్

అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎదుర్కొనే ప్రతి దశ సమాచారాన్ని ఈ ఐడీలో నమోదు చేయనున్నారు. అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికైనా లేదా ఏదైనా దశలో పోటీ నుంచి తప్పుకున్నా వారి పూర్తి వివరాలు భద్రంగా ఉండేలా ఫామ్-ఏ, ఫామ్-బీతో కూడిన ప్రత్యేక ప్రొఫార్మాను సిద్ధం చేస్తున్నారు.

యూనిఫాం సర్వీసుల నియామకాల్లో రాత పరీక్షతో పాటు శారీరక కొలతల పరీక్ష (PMT), శారీరక సామర్థ్య పరీక్షలు (PET) అత్యంత కీలకం. రిజర్వేషన్ల వారీగా వర్టికల్, హారిజంటల్ కేటగీరీల్లో కటాఫ్ మార్కులను ఖరారు చేసే సమయంలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అభ్యర్థి సాధించిన మార్కులు, అర్హతలను నేరుగా ఈ యూనిక్ ఐడీతో అనుసంధానిస్తారు.

యూనిక్ ఐడీలో నమోదు అయ్యే వివరాలు:

  • పార్ట్-1 దరఖాస్తు: ప్రాథమిక రాతపరీక్షకు ముందు అభ్యర్థి సమర్పించే వివరాలు.
  • పార్ట్-2 దరఖాస్తు: ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన తర్వాత నమోదు చేసే వివరాలు.
  • PMT & PET ఫలితాలు: శారీరక కొలతలు, సామర్థ్య పరీక్షల డేటా.
  • తుది మార్కులు & ర్యాంకు: మెయిన్స్ రాతపరీక్ష మార్కులు, సాధించిన ర్యాంకు.
  • స్పెషల్ బ్రాంచ్ నివేదిక: అభ్యర్థుల పూర్వచరిత్ర (Background Verification) పై ఎస్‌బీ నిర్వహించే విచారణ సమాచారం.

వివాదాలకు చెక్.. సులభతరం కానున్న రికార్డులు

నియామక ప్రక్రియపై భవిష్యత్తులో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా, ఫిర్యాదులు ఇచ్చినా లేదా న్యాయస్థానాలను ఆశ్రయించినా అధికారులు తక్షణమే ఆధారాలను పరిశీలించే అవకాశం కలుగుతుంది. ప్రతి దశకు సంబంధించి డిజిటల్ ఆధారం ఉండటం వల్ల నియామకాల్లో వివాదాలు తగ్గడంతో పాటు రికార్డుల నిర్వహణ చాలా సులభతరం కానుందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ భావిస్తోంది.

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా.. మంత్రి పొంగులేటి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha