Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తీరప్రాంతాల్లో సముద్ర నాచు పెంపకంపై అవకాశాలు

తీరప్రాంతాల్లో సముద్ర నాచు పెంపకంపై అవకాశాలు

వార్త 3 months ago

న్యూట్రాసిటికల్ ఉత్పత్తుల తయారీలో సీవిడ్ కీలక ముడిసరుకు

AP Seaweed Farming: రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తులు, విలువ జోడింపు తదితర అంశాల్లో మహిళలు ఆదాయాన్ని అర్జించేందుకు వీలుగా ఓ ఎకనామిక్ మోడల్ సిద్దం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్తో స్వయం సహాయ సంఘాల మహిళలు,మత్య్సకారులకు అదనపు ఆదాయల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీవిడ్ కల్టివేషన్ ద్వారా ఎస్ హెచ్ జీ మహిళల ఆదాయ మార్గాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు. ఏపీలోని సముద్ర తీరప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్ విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read also: Anantha Babu Case: ఎమ్మెల్సీ అనంత బాబు సెంట్రల్ జైలుకు తరలింపు

 Seaweed farming in coastal areas

AP Seaweed Farming: అంతర్జాతీయ స్థాయిలో నాచు ఉత్పత్తుల గిరాకీ

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఓషన్ టెక్నాలజీ, సెంటల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వర్చువల్గా మాట్లాడారు. అమృతా విశ్వ విద్యాపీఠంతో కలిసి మహిళలకు సీవీడ్ కల్చర్ సాగుకు సంబంధించిన అంశాలపై ఓ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సీవీడ్ ద్వారా వచ్చే ఆదాయంపై ఓ ఎకనామిక్ మోడల్ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

సంపద సృష్టికి సరికొత్త ఎకనామిక్ మోడల్

రాష్ట్రంలోని సుదీర్ఘమైన తీరప్రాంతంలో సముద్ర నాచు సాగు ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేలా వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి పేర్కొన్నారు. సీవీడ్ ద్వారా వివిధ ఉత్పత్తులు తయారుచేసేందుకు విలువ జోడించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించాలన్నారు. సంపద సృష్టికి సీవీడ్ ఓ కీలకమైన ప్రత్యామ్యానం అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫార్మా సహా, న్యూట్రాసిటికల్ ఉత్పత్తుల్లో ప్రధానమైన ముడిసరుకుగా ఈ సీవీడ్ అంతర్జాతీయ మార్కెట్ను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఏపీకి 'రాయల్' ఎంట్రీ.. బుల్లెట్ బైక్ వీడియోతో లోకేశ్ ఆసక్తికర పోస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha