Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుచ్చి ఈస్ట్‌కు విజయ్ రాజీనామా!

తిరుచ్చి ఈస్ట్‌కు విజయ్ రాజీనామా!

వార్త 3 months ago

CM Vijay: తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ తన ఎమ్మెల్యే పదవిపై స్పష్టతనిచ్చారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు.

అయితే, నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, విజయ్ తన తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై పెరంబూర్ నియోజకవర్గ ప్రతినిధిగానే కొనసాగుతారని రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారికంగా ప్రకటించింది.

Read Also:Bengaluru Crime:యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టా ప్రేమ

 CM Vijay Resignation, Trichy East Assembly Seat

CM Vijay: జయలలిత తర్వాత విజయ్ అరుదైన రికార్డు

తమిళనాడు రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత తర్వాత రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి, రెండింటిలోనూ విజయం సాధించిన నేతగా విజయ్ అరుదైన గుర్తింపు పొందారు. ఈ విజయం ఆయన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మరోసారి నిరూపించింది.చట్ట ప్రకారం.. ఒక అభ్యర్థి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చు. ఒకవేళ ఈ రెండు స్థానాల్లో గెలిస్తే ఒకదానిక కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది.అందుకే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ స్థానాన్ని వదులుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ప్రోటోకాల్ పక్కనబెట్టి.. పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha