Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల భక్తులకు శుభవార్త.. పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు!

తిరుమల భక్తులకు శుభవార్త.. పిల్లలకు ఉచితంగా అక్షర గోవిందం కిట్లు!

వార్త 3 months ago

TTD Updates: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలకమండలి తాజాగా భక్తుల ప్రయోజనాలే లక్ష్యంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా చిన్న పిల్లల అక్షరాభ్యాసం కోసం నిర్వహించే 'అక్షర గోవిందం' కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఏడు వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.

బాసర తరహాలోనే వకుళామాత సన్నిధిలో ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, త్వరలోనే భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం కోసం భారీగా నిధులు కేటాయించడం విశేషం.

Read also: TTD updates: తిరుమల దర్శనం ఇప్పుడు మరింత సులభం

 TTD Board decisions for devotees 2026

TTD Updates: ఉద్యోగుల సంక్షేమం కోసం టీటీడీ కీలక అడుగులు

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల చిరకాల కోరికను నెరవేరుస్తూ వారికి శ్రీవారి దర్శనం అలాగే లడ్డూ ప్రసాదం కార్డులు జారీ చేయాలని బోర్డు తీర్మానించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం హెల్త్ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆమోదం తెలిపింది. నవీ ముంబైలోని శ్రీవారి ఆలయ నిర్వహణ కోసం అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరాలని నిర్ణయించింది. టీటీడీ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం రూ.43.40 కోట్లు అదనంగా కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేసింది.

ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిపై బోర్డు ప్రత్యేక దృష్టి

అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం యాగశాల నిర్మించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా.శోభారాజును టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా నియమిస్తూ గౌరవించుకుంది. అమరావతి వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ అభివృద్ధికి రూ.36.95 కోట్లతో ఏడు అంతస్తుల రాజగోపురం, ఇతర మండపాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. తిరుమలలోని ప్రధాన రహదారులు, కూడళ్లకు పురాణాల్లోని పేర్లు పెట్టడం ద్వారా ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కొడంగల్‌కు తిరుమల వైభవం.. రూ.110 కోట్లతో భారీ మార్పులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha