Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల వీధులకు కొత్త ఆధ్యాత్మిక పేర్లు ఖరారు

తిరుమల వీధులకు కొత్త ఆధ్యాత్మిక పేర్లు ఖరారు

వార్త 2 weeks ago

తిరుమలకు కొత్త ఆధ్యాత్మిక గుర్తింపు

Tirumala News : తిరుమల తిరుపతి దేవస్థానాలు పాలకమండలి తిరుమలలోని వీధులు, సర్కిళ్లు, ప్రధాన మార్గాలకు ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన కొత్త పేర్లను ఖరారు చేసింది.

కమిటీ సిఫార్సుల మేరకు తీసుకున్న ఈ నిర్ణయాలకు పాలకమండలి సమావేశంలో ఆమోదం లభించింది.

త్వరలోనే ఈ కొత్త పేర్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. తిరుమల ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ప్రతిబింబించేలా ఈ నామకరణాలు ఉండనున్నాయని అధికారులు తెలిపారు.

నాలుగు మాడ వీధులకు వేదాల పేర్లు

శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లను ఖరారు చేశారు. తూర్పు మాడ వీధిని 'రుగ్వేద మార్గం', దక్షిణ మాడ వీధిని 'యజుర్వేద మార్గం', పశ్చిమ మాడ వీధిని 'సామవేద మార్గం', ఉత్తర మాడ వీధిని 'అధర్వణవేద మార్గం'గా పిలవనున్నారు. అలాగే ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశానికి 'భగవద్రామానుజాచార్య ప్రాంగణం' అని, బేడి ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతానికి 'సాళువ నరసింహరాయల ప్రాంగణం' అని పేర్లు పెట్టారు.

సర్కిళ్లు, రహదారులకు కొత్త నామకరణం

తిరుమలలోని ప్రధాన కూడళ్ల పేర్లను కూడా మార్చారు. లేపాక్షి సర్కిల్‌ను 'అన్నమయ్య కూడలి', రామ్‌బగీచ సర్కిల్‌ను 'తొండమాన్ చక్రవర్తి కూడలి', ఎస్‌ఎంసీ సర్కిల్‌ను 'పురందరదాసు కూడలి'గా నామకరణం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 'తిరువేంకటపథం', ఇన్నర్ రింగ్ రోడ్డుకు 'అన్నమాచార్య మార్గం' పేర్లు ఖరారయ్యాయి. రామ్‌బగీచ నుంచి పుష్కరిణి వరకు ఉన్న మార్గానికి 'శ్రీ కృష్ణదేవరాయల మార్గం' అని పేరు పెట్టారు.

Read Also:Tamilnadu Results: ఎన్నికల్లో ధనస్వామ్యం ఓడి ప్రజాస్వామ్యం గెలిచింది - విజయ్

 Tirumala News

అభివృద్ధి పనులకు ఆమోదం

భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులకు కూడా పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆళ్వార్ ట్యాంక్ నుంచి బాట గంగమ్మ సర్కిల్ వరకు ఉన్న సర్వదర్శనం క్యూలైన్లలో రూ.4.55 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించనున్నారు.

వరాహస్వామి విశ్రాంతి భవనంలో రూ.3.61 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు అందించే ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం కోసం ప్రత్యేక యాగశాల నిర్మించేందుకు కూడా ఆమోదం తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

టీవీకే ఎమ్మెల్యేగా తెలుగు మహిళా సంచలనం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha