TTD Updates: తిరుమల శ్రీవారి ఆలయంలో గత నాలుగు రోజులుగా భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం కోసం దాదాపు 24 నుండి 30 గంటల సమయం పడుతోంది.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో సుదీర్ఘంగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రద్దీ కారణంగా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Tirumala devotees rush update
క్యూలైన్లలో పెరుగుతున్న భక్తుల తాకిడి
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. రద్దీ పెరగడంతో క్యూలైన్లు క్యూ కాంప్లెక్స్ దాటి బాటగంగమ్మ గుడి వరకు సుదీర్ఘంగా విస్తరించాయి. వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో ఉన్న వారికి తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
TTD Updates: శ్రీవారి సేవలో భక్తుల రికార్డు సంఖ్య
శనివారం ఒక్క రోజే ఏకంగా 97,561 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అదే రోజు 57,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారికంగా వెల్లడించింది. భక్తులు తమ దర్శన సమయాన్ని, క్యూలైన్ల వివరాలను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మంచిది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. కలెక్టర్ కీలక ఉత్తర్వులు

