Tirumala updates: తిరుమల కొండపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం ఏకంగా 30 గంటలకు చేరుకుంది. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు ముగుస్తుండటం, పరీక్షల ఫలితాలు రావడంతో స్వామివారి మొక్కులు చెల్లించుకోవడానికి జనం భారీగా తరలివచ్చారు.
బుధవారం మధ్యాహ్నం రద్దీ ఎక్కువ కావడంతో అధికారులు క్యూలైన్లను 7 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేసి, రాత్రి 8 గంటలకు మళ్లీ ప్రారంభించారు.
Read also: AP Bakrid Holiday Date: 27న కాదు 28న బక్రీద్ సెలవు.. జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
Tirumala Sri Vari Sarvadarsanam Rush
క్యూ కాంప్లెక్స్ లో రద్దీ వివరాలు
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు 6 నుండి 7 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 నుండి 5 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు సాగాయి.
Tirumala updates: భక్తుల సంఖ్య హుండీ ఆదాయం
బుధవారం ఒక్కరోజే 86,315 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారికి 44,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చింది. ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నపానీయాలు అందిస్తూ పర్యవేక్షిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

