Tirupati Digi Rythu Bazar: ఏపీ ప్రభుత్వం సామాన్యుల కోసం సరికొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో సక్సెస్ అయిన డిజి రైతు బజార్ సేవలు ఇప్పుడు తిరుపతిలో కూడా ప్రారంభం కానున్నాయి.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రాయలచెరువు రోడ్డు వద్ద ప్రత్యేక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు మార్కెట్‌కు వెళ్లే పని లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
Read also: AP Politics: సైకో పార్టీ సినిమాకు శుభం కార్డు వేసేది పసుపు సైన్యమే
Digi Rythu Bazar Door Delivery Tirupati
Tirupati Digi Rythu Bazar: తక్కువ ధరకే నాణ్యమైన పండ్లు, కూరగాయలు
ఈ విధానంలో రైతుల నుంచి సేకరించిన తాజా ఉత్పత్తులను తక్కువ ధరలకే అందిస్తారు. ప్రైవేట్ యాప్‌లతో పోలిస్తే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండటం వల్ల నాణ్యత విషయంలో నమ్మకంగా ఉండవచ్చు. తిరుపతి నగర పరిధిలో ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న వారికి ఈ హోమ్ డెలివరీ సౌకర్యం లభిస్తుంది. కనీసం వంద రూపాయల ఆర్డర్ చేస్తే చాలు.. ఇంటి వద్దకే డెలివరీ బాయ్స్ వచ్చి వస్తువులు అందిస్తారు. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు కాబట్టి రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి.
డిజిఆర్‌బీ (DGRB) యాప్ వాడటం ఎలా?
వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ‘డిజి రైతు బజార్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో పేరు, ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ నమోదు చేస్తే చాలు.. ఆర్డర్ చేయడానికి సిద్ధం కావచ్చు. అందుబాటులో ఉన్న కూరగాయల ధరల జాబితా కూడా యాప్‌లోనే కనిపిస్తుంది. సమయం ఆదా అవ్వడమే కాకుండా.. ఎండలో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటికి సరుకులు వస్తాయి. త్వరలోనే ఈ సేవలను నగరం మొత్తం పూర్తిస్థాయిలో విస్తరించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

