Tamil Nadu Election Results: టీవీకే దూకుడు.. 100 దాటిన ఆధిక్యం తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 మే 4 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య సాగుతున్న ద్విముఖ పోటీకి స్వస్తి పలుకుతూ, దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (TVK) సంచలన ఫలితాలను నమోదు చేస్తోంది.
తాజా ట్రెండ్స్ ప్రకారం, టీవీకే ఏకంగా 100కు పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారానికి చేరువవుతోంది. సినీ గ్లామర్‌తో పాటు బలమైన సిద్ధాంతాలతో విజయ్ ప్రజల్లోకి వెళ్లడం ఈ భారీ విజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Read Also : West Bengal Elections: అధికారం పోతే పార్టీ క్లోజ్.. మమతకు తప్పని గండం!
Tamil Nadu Election Results: నిజమైన ప్రశాంత్ కిషోర్ అంచనా
తన కుమారుడు రాజకీయాల్లో ఇంతటి ఘనవిజయం సాధించడంపై విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారు ఆనందంతో ఒకరినొకరు హత్తుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ప్రముఖ రాజకీయ ప్రశాంత్ కిషోర్ గతంలో విజయ్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. "విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగితేనే ప్రజలు ఆయనను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తిస్తారు" అని ఆయన జోస్యం చెప్పారు. చెప్పినట్లుగానే, విజయ్ సింగిల్ గా పోటీ చేసి తమిళ రాజకీయాల్లో పెను మార్పును తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం
చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా 'విజయ్' నామస్మరణే వినిపిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపినట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్థాయి క్లారిటీ రానుండటంతో, విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్త ఉత్కంఠకు దారితీస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తమిళనాడులో 'విజయ్' సునామీ.. నటుడు శ్రీమాన్ విజిల్స్

