TMC : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ శాసనసభ్యులను పోలీసులు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పోలీసులు నేరుగా బెదిరించినట్లు స్వయంగా ఆ ప్రజాప్రతినిధులే తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించిన మమత, దాదాపు 177 నియోజకవర్గాల్లో భారీస్థాయిలో రిగ్గింగ్ జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు, పక్కా డాక్యుమెంట్లు ప్రస్తుతం తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు.
Read Also : డ్రైవర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే

తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం
పార్టీలో అంతర్గతంగా చెలరేగుతున్న అసంతృప్తి, తిరుగుబాటు సంకేతాలపై మమతా బెనర్జీ ఉక్కుపాదం మోపారు. ఒకవైపు పోలీసుల వేధింపులపై పోరాడుతూనే, మరోవైపు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే బలమైన కారణంతో ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై ఆమె బహిష్కరణ వేటు వేశారు. సొంత పార్టీ నేతలే గైర్హాజరు కావడం, రాజీనామాలు చేస్తుండటంతో వస్తున్న రాజకీయ ఒత్తిడిని అధిగమించేందుకు మమత ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అణచివేత చర్యలకు తాము భయపడే ప్రసక్తే లేదని, ఈ అక్రమాలకు వ్యతిరేకంగా న్యాయపరంగా, రాజకీయంగా పోరాటం సాగిస్తామని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

