Donald Trump FIFA Balogun: జూలై 1న బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో (USA 2-0తో గెలిచింది) ప్రత్యర్థి ఆటగాడిపై ఫౌల్ చేసినందుకు బాలోగన్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపించారు.
ఫుట్‌బాల్ నిబంధనల ప్రకారం రెడ్ కార్డ్ వస్తే తదుపరి మ్యాచ్‌కు ఆటోమేటిక్‌గా ఒక మ్యాచ్ నిషేధం (Suspension) విధిస్తారు. అయితే, ఈ టోర్నీలో 3 గోల్స్ చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తమ కీలక ఆటగాడిపై నిషేధం పడటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు.
Read Also:Anvay Dravid: లంక గడ్డపై రాహుల్ ద్రవిడ్ కొడుకు సంచలన బ్యాటింగ్

ఫిఫా అధ్యక్షుడికి ట్రంప్ ఫోన్ కాల్
డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఓవల్ ఆఫీస్ నుండి ఫిఫా (FIFA) ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినోకు ఫోన్ చేసి మాట్లాడినట్లు స్వయంగా ధృవీకరించారు. “అది అసలు ఫౌలే కాదు. ఇద్దరు గొప్ప అథ్లెట్లు వేగంగా పరిగెడుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. ఒక మ్యాచ్‌లో తప్పు జరిగితే ఆ మ్యాచ్‌కు శిక్ష వేయవచ్చు, కానీ ఇంకా జరగని తదుపరి మ్యాచ్ ఆడకుండా ఎలా ఆపుతారు? ఇది తీవ్ర అన్యాయం” అని ట్రంప్ ఫిఫా చీఫ్‌తో వాదించారు. అలాగే సదరు రిఫరీ గతాన్ని కూడా ‘అనుమానాస్పదమైనది’గా ట్రంప్ అభివర్ణించారు.
సస్పెన్షన్ ఎత్తివేత.. ఫుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి!
ట్రంప్ జోక్యంతో ఫిఫా డిసిప్లినరీ కమిటీ తమ ఆర్టికల్ 27 (Article 27) నిబంధనను ఉపయోగించి బాలోగన్‌పై ఉన్న ఒక మ్యాచ్ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ (Probationary period కిందకు మారుస్తూ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్‌కప్ చరిత్రలో 1962 తర్వాత ఒక ప్లేయర్‌కు రెడ్ కార్డ్ వచ్చినా నిషేధం అమలు కాకపోవడం ఇదే తొలిసారి కావడంతో ఫుట్‌బాల్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఫిఫా నిర్ణయంపై రాయల్ బెల్జియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (RBFA) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బెల్జియం కోచ్ రూడీ గార్సియా ఈ నిర్ణయాన్ని ఎగతాళి చేయగా, ఐరోపా ఫుట్‌బాల్ సమైక్య (UEFA) కూడా ఫిఫా తీరును తీవ్రంగా విమర్శించింది.
Donald Trump FIFA Balogun: రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ ఫలితం
ట్రంప్ ఒత్తిడి వల్ల లభించిన ఊరటతో బాలోగన్ జూలై 7న బెల్జియంతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 నాకౌట్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. పూర్తి సమయం (90 నిమిషాలు) ఆడినప్పటికీ అతను ఎలాంటి గోల్ చేయలేకపోయాడు. అమెరికా తరఫున మాలిక్ టిల్‌మన్ ఒక గోల్ చేసినప్పటికీ.. బెల్జియం ఆటగాళ్లు చార్లెస్ డి కేటెలారే (2 గోల్స్), హన్స్ వనాకెన్, రొమేలు లుకాకు చెలరేగడంతో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఘోరంగా ఓడించింది. దీంతో ట్రంప్ ఇంతగా జోక్యం చేసుకున్నప్పటికీ అమెరికా జట్టు వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించక తప్పలేదు.
Epaper: epaper.vaartha.com
ఇదే నా చివరి ప్రపంచకప్.. క్రిస్టియానో రొనాల్డో భావోద్వేగ ప్రకటన

