Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న విలీనంపై కీలక నిర్ణయం!

TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న విలీనంపై కీలక నిర్ణయం!

వార్త 2 weeks ago

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించేలా చూడాలి ఎంపి వేం నరేందర్రెడ్డికి ఆర్టీసీ జెఎసి విజప్తి

Telangana RTC News: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం జూన్ 2న అపాయింటెడ్ డేట్ ప్రకటించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు రాజ్యసభ సభ్యుడు నరేందర్రెడ్డిని కోరారు.

జేఏసీ నేతలు గురువారం వేం నరేందర్ రెడ్డి నివాసంలో కలసి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంపై పలు అంశాలను పొందపరిచిన వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆయనతోపాటు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘు రామ్ రెడ్డినీ కలిసిన జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కో కన్వీనర్ బి యాదగిరి, వి బాబు, ఎన్ బుద్ద విశాల్, జి రవికిరణ్ కలిసి ప్రస్తుత ఆర్టీసీ విలీనం గురించి జరుగుతున్న పరిణామాలపై క్షుణ్ణంగా వివరించినట్టు జేఏసీ నేతలు తెలిపారు. జేఏసీ నాయకులను ఉద్దేశించి వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటుందని స్పష్టత ఇచ్చారని జేఏసీ నాయకులు తెలిపారు.

Read also: NTR Statue Unveiling : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే - సీఎం రేవంత్

 June 2nd is the appointed date for the TSRTC merger.

Telangana RTC News: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై దృష్టి

అలాగే జూన్ 2 తేదీన అపాయింటెడ్ డేట్ ప్రకటన గురించి, విలీన విధి విధానాలకోసం అధికారులు, కార్మిక సంఘాలతో కమిటి వేసి, విలీనం సక్రమంగా చేపించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రాలో ఆర్టీసీ ఉద్యోగులకు జరిగిన నష్టం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు జరుగకుండా కార్మిక సంఘాలు, అధికారులు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారన్నారు. విలీనంతో ఆర్టీసీ కార్మికులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అందుకు సక్రమంగా, సజావుగా విలీనం జరగడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసా ఇచ్చారన్నారు. విలీనం గురించి కార్మికుల్లో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల గురించి పూర్తి వివరాలు జేఏసీ నాయకులు వివరిస్తున్నపుడు ఎంతో ఓపికతో విని ఆర్టీసీ కార్మికుల మనోభావాలను చిరకాల ఆకాంక్షను సహృదయంతో అర్థం చేసుకొని విలీనంపై స్పష్టమైన హామీ ఇచ్చినందుకు ఆర్టీసీ కార్మికుల పక్షాన హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జేఏసీ నేతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha