Twisha Sharma: నోయిడాకు చెందిన ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌పై ట్విషా సోదరుడు, ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మేజర్ హర్షిత్ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
చనిపోయిన తన సోదరిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరి అత్త ప్రవర్తిస్తున్న తీరు 'ఊహకందని స్థాయి క్రూరత్వానికి' నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మేజర్ హర్షిత్ శర్మ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలరో తనకు అర్థం కావడం లేదు నా చెల్లి బతికున్నప్పుడు ఒకలా, ఆమె చనిపోయిన తర్వాత మరోలా గిరిబాలా సింగ్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మాజీ జడ్జి అయిన గిరిబాలా సింగ్ తన పూర్వ హోదాను, పలుకుబడిని అడ్డం పెట్టుకుని న్యాయవ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Read Also : Modi : కేంద్ర మంత్రులతో సుదీర్ఘ సమావేశంలో మోదీ ఏం చెప్పారంటే?
Blame my dead sister?.. Twisha Sharma’s brother is angry
Twisha Sharma: “ఆ మాజీ జడ్జికి నేను ఒకసారి బెయిల్ నిబంధనలను గుర్తు చేయాలనుకుంటున్నాను. నిబంధనల ప్రకారం ఆమె దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదు, అలాగే చనిపోయిన నా సోదరి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. కానీ ఆమె ప్రజల దృష్టిని, దర్యాప్తు ఏజెన్సీల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఏ చట్టాల ఆధారంగా అయితే ఆమె కోర్టుల్లో తీర్పులు ఇచ్చారో, ఆ చట్టాలనే ఆమె ఇప్పుడు పూర్తిగా మరచిపోయి ప్రవర్తిస్తున్నారు” అంటూ మేజర్ హర్షిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమెకు బెయిల్ ఎలా మంజూరైందని, బెయిల్ వచ్చిన తర్వాత ఆమె చేస్తున్న ఇలాంటి చర్యలను వ్యవస్థలు ఎలా సమర్థించుకుంటున్నాయని, ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
తన సోదరి శీలాన్ని శంకించడంపై మేజర్ హర్షిత్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒక బిడ్డకు జన్మనివ్వాలని ఆశపడిన మహిళ వ్యక్తిత్వాన్ని భర్తతో పాటు అత్త కూడా అనుమానించడం ఎంతవరకు న్యాయమని అడిగారు. ఆ ఇంట్లో నివసించే ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు పుట్టబోయే బిడ్డ గురించి, కోడలి క్యారెక్టర్ గురించి ఇలా అనుమానిస్తూ వేధిస్తుంటే, అలాంటి పరిస్థితి లో ఏ మహిళ అయినా ప్రశాంతంగా ఎలా బతకగలదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిబాలా సింగ్ ప్రస్తుతం ఒక మూలకు నెట్టబడిన జంతువులా ప్రవర్తిస్తూ ఏం మాట్లాడుతుందో తెలియని స్థితిలో ఉందని, తాము మాత్రం ఆమె మాటలను పట్టించుకోకుండా చట్టపరమైన న్యాయపోరాటంపైనే దృష్టి పెట్టామని స్పష్టం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

