Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉద్యోగ భద్రతకు ఎఐ ముప్పు!

ఉద్యోగ భద్రతకు ఎఐ ముప్పు!

వార్త 1 week ago

AI Threat : అందమైన ప్రపంచంలో అపరిమి తమైన అద్భుతాలను సృష్టించి, సైన్స్ ఫిక్సన్ కథల స్థాయిని దాటి, మానవ జీవితాలను ఒక తెలియని, వింతలోకా లకు తోడ్కొని పోయి, అమితమైన మానసికానందానికి గురిచేసి, కనీ వినీ ఎరుగని అనుభూతిని ఆస్వాదించే స్థితిని స్పృశించడానికి విజ్ఞాన గవా క్షాలు తెరచుకున్నాయి.

ఒకప్పటి పరి స్థితులను సింహావలోకనం చేసుకుం టే అప్పటి మనమెక్కడ? ఇప్పటి మనమెక్కడ? అనే ఆశ్చర్యం కలుగక తప్పదు. ఎడ్లబండ్ల నుండి ఎయిర్ బస్సుల వరకు మానవ విజ్ఞానం అనేక మలుపులు తిరిగింది. భూగోళం నుండి ఖగోళం వరకు మానవ ఆలోచనా పరిధి వినృత రూపం ధరించింది. మానవ మేథస్సు విస్తృతమై, నిరంతరం అనంతమైన విజ్ఞాన సాగర మథనం చేస్తూ, అలుపెరుగని శ్రమతో అద్బు తాలను సృష్టిస్తూ మానవ జీవితాలను సౌకర్యవం తమైన మార్గంలో నడిపించడానికి విస్తృతమైన ఆలోచనలు సాగిస్తున్న మానవ మేధస్సు ను ప్రశంసించక తప్పదు. ఇదే సందర్భంలో విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం వెర్రితలలు వేసి, విలువలను విధ్వంసం చేసి, మానవ సంబంధాలను దూరం చేయడం దురదృష్టకరం. వర్తమానంలో సాంకేతిక విప్లవం పెను మార్పులకు దారితీస్తున్నది. మనిషి అందించే డేటా సాయంతో రోబోలు కాని కంప్యూటర్ల ద్వారా పనిచేసే యంత్రాలు గాని అత్యంత సమర్థవంతంగా తమ భూమిక పోషించగలుగుతాయి.

Read Also : NH -65 Highway Expansion : హైదరాబాద్‌-విజయవాడ హైవేకు ఆరు వరుసల రూపం

 AI Threat

AI Threat : సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ఇక ముగిసినట్టు

మనిషి కంటే అనేక రెట్ల సామర్థ్యం కృత్రిమ మేథ ద్వారా పని చేసే మెషీన్ల సొంతం. అందుకే వీటిపట్ల అనేక సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఆసక్తి చూపుతున్నాయి. భవిష్యత్తు అంతా కృత్రిమ మేథ సొంతం కాక తప్పదు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధిపత్యం ఎంత వరకు దారితీస్తుందో తలచుకుంటేనే వెన్నులో వణుకుపుడు తుంది. ఏఐ వలన ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమయ్యే సూచ నలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అవగాహనా లేమితో ప్రతీ సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారు. ఇంజినీరింగ్ రం గంలో అనేక శాఖలున్నప్పటికీ, చదువు పూర్తయిన యువత పలుచోట్ల పనిచేసే అవకాశాలున్నప్పటికీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది చదువుకున్న ప్రతీ ఒక్కరి కలగా. లక్ష్యంగా, నేటి యువతకు అదొక ట్రెండ్గా మారి పోయింది. ఇంజినీరింగ్ చదివిన వారే కాకుండా, ఇతర డిగ్రీలు చదివిన వారుకూడా కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని, జీతం ఎంతయినా ఫర్వా లేదనే సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తూ, మల్టీ నేషనల్ కంపె నీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేయడానికి ఆసక్తి చూపు తున్నారు. ప్రతీ ఏడాది ఇబ్బడి ము బ్బడిగా పెరుగుతున్న సాఫ్ట్వేర్ ఆశావాహకులకు ఉద్యోగాలు కల్పించడం కష్టత రంగా మారింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే, సాఫ్ట్వేర్ స్వర్ణయుగం ఇక ముగిసినట్టుగానే భావించవలసి వస్తున్నది.

ఎఐ సర్వాంతర్యామిగా మారి

మానవ విజ్ఞానంతో సృష్టించిన ‘కృత్రిమ మేథ’ మానవాళికే పెను ముప్పుగా నేటితరం మరచిపో యింది. సహజ సిద్ధమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసి, కృత్రిమ వాతావరణంలో బ్రతుకీడ్చుతున్నాం. కాలుష్యాన్ని ఆస్వాదిస్తూ, కల్తీని ” భుజిస్తూ, ఆరోగ్యాన్ని ఆసుపత్రుల పాలు చేస్తున్నాం. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్టుగా, మనకు ఆశ్రయమిచ్చిన భూగ్రహాన్ని కాలుష్యంతో నింపి, భూగర్భజలాలను హరించి, పంట పొలాలను నిస్సారంగా మార్చి, భూగ్రహాన్ని నిర్జీవంగా తయారు చేసి, అనువుగాని గ్రహాంతర వాసానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. సాంకేతిక పరిజ్ఞా నం కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారుతున్న నేపథ్యంలో మానవ మేథస్సుతో తయారైన ‘ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్’ మానవ మెదళ్లకు బూజు పట్టిస్తూ, మనసు లేని మనుషులుగా మానవ ఆలో చనలకు తుప్పు పట్టిస్తున్నది. ఏఐ జ లికి పోవద్దని ఎంతో మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు ముందుగానే హెచ్చ రించినా కొన్ని టెక్ కంపెనీలు మాట వినలేదు. ఇప్పుడు ఎఐ సర్వాంతర్యామిగా మారి, మానవాళికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉపాధి అవకాశాలను మింగేసి, అనవసరమైన సమస్యలను సృష్టించే ఎఐ ముప్పు పట్ల ప్రపంచ దేశాలు, టెక్ నిపుణులు, సాఫ్ట్వేర్ వ్యవస్థలు జాగరూకత వహించాలి. సమీప భవిష్యత్తులో మానవ జీవితం ఎలా ఉంటుందో ఊ హించుకుంటేనే భయోత్పాతం కలుగుతుంది. టన్నుల కొద్దీ గుప్పిస్తున్న టెక్నాలజీ ‘ఆర్టి ఫీషియల్ ఇంటిలిజెన్స్’ గా రూపాంతరం చెందింది.

చదువుతో ఇక అవసరం లేదోమోనన్న భావన

ఎఐ పరిచయంతో చదువుతో ఇక అవసరం లేదోమోనన్న భావన కలుగుతున్నది. కోడింగ్ కూడా ఏఐద్వారా స్వల్ప వ్యవధిలో సాధ్యపడుతుండగా, ఇక ఉ ద్యోగులతో పనేముంటుంది? వైద్య శాస్త్రంలో కూడా ఎఐ ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. వైద్యులు అధునాతన వైద్య చికిత్సా విధానం కొరకు, రోగా నికి మందుల కోసం పెద్దపెద్ద పుస్తకాలు అధ్యయనం చేయ నక్కరలేదు. ఏ రోగానికి ఏ మందు రాయాలో వైద్యుడు ఆలోచించనక్కర లేదు. వందలాది ఫైళ్ళను ఎఐ నిమిషాల్లో స్కాన్ చేసి రోగానికి మందు నిర్ణయిస్తుంది. ఎఐ ప్రభావం అన్ని రంగాల మీద పడుతున్నది. వేల కోట్లు వెచ్చించి ఒరాకిల్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు ఎఐ వైపు దూ సుకుపోతున్నాయి. ఇది వరకు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఒరాకిల్ ఈ మధ్య మరికొంత మంది ఉద్యోగు లను ఒకే ఒక్క మెయిల్ ద్వారా చడీ చప్పుడు లేకుండా ఉద్యోగాల నుండి పీకేసింది. ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఉ ద్యోగాలు పోతే ఈ ప్రభావం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కోట్లాది మంది పై ప్రభావం చూపిస్తుంది. అన్నిరంగాలు పేకమేడల్లా కుప్ప కూలిపోయే అవకాశముంది. ఎఐ ‘భవిష్యత్తుకాదు.

 AI Threat

మానవుల పాలిట భూతంలా

మాన వుల పాలిట భూతంలా, శాపంలా మారబోతున్నది. ప్రమాద కరమైన పరిశ్రమల్లోను, భూగర్భ సంపద వెలికి తీయడం లోను, మనుషులు చేయలేని పనుల్లోను ఎఐను ఉపయో గించాలి. ఎఐ వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించాలి. కృత్రిమ మేథస్సు కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి, మానవ జీవితాలను కకావికలం చేయరాదు. జీవిత భద్రతకు తోడ్ప డకుండా, భయాన్ని సృష్టిస్తున్న ఎఐ భవిష్యత్తుకు ప్రమాద కరం. రెండు సంవత్సరాలు కోవిడ్ సంక్షోభం వలన ప్రపంచ దేశాలు ఆర్థికంగా దివాలా తీసాయి. రష్యాఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధంవలన ప్రపంచ దేశాల్లో ఆర్థికమాంద్యం ఏర్పడింది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటాయి. సా మాన్య ప్రజలు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉంది. సాఫ్ట్ రంగం అనేక ఒడిదుడుకులకులోనై, లే ఆఫ్ లు ప్రక టిస్తున్నది. పులి మీద పుట్రలా ఆర్టిఫీషి యల్ ఇంటిలిజెన్స్ విద్యావంతుల ఉపాధిఅవకాశాలను దెబ్బ తీస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కీలకం. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితుల వలన, ఎఐ ప్రవేశంతో ఏర్పడుతున్న పరిణామాలను బట్టి విద్యార్థు లకు, యువతకు సరైన దశాదిశా నిర్దేశనం చేయాలి.

-సుంకవల్లి సత్తిరాజు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం: ట్రాఫిక్ ఆంక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha