Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

వార్త 3 months ago

UP Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కస్‌గంజ్ జిల్లాలోని అమాన్‌పూర్ పట్టణంలో శనివారం సాయంత్రం, ఒకే ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Chhattisgarh crime: వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన స్వీపర్- శిశువు మృతి

పిల్లలను చంపి.. తండ్రి బలవన్మరణం

పోలీసుల కథనం ప్రకారం, శ్యామ్‌వీర్ సింగ్ (50) అనే వ్యక్తి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో, తన భార్య రామశ్రీ (46), కుమార్తెలు ప్రాచి (14), ఆకాంక్ష (12), కుమారుడు గిరీష్ (10) లను దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులను హతమార్చిన అనంతరం శ్యామ్‌వీర్ కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం వరకు ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన పొరుగువారు కిటికీలోంచి చూడగా, ఈ ఘోరం బయటపడింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha