Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉప రాష్ట్రపతి పర్యటన మార్గాల్లో 'భద్రతా' తనిఖీ

ఉప రాష్ట్రపతి పర్యటన మార్గాల్లో 'భద్రతా' తనిఖీ

వార్త 1 month ago

శ్రీకూర్మం, అరసవల్లి క్షేత్రాలను పరిశీలించిన ఏఎస్‌ఎల్‌ బృందం

కేంద్ర అధికార బృందంతో కలిసి ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ ఆరా

ముస్తాబవుతున్న ఆధ్యాత్మిక క్షేత్రాలు

Srikakulam: భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తున్నారు. సోమవారం ఉదయం 10.50 నిమిషాలకు ఉపరాష్ట్రపతి రానుండటంతో జిల్లా యంత్రాంగం, కేంద్ర భద్రతా విభాగం సంయుక్తంగా ‘అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్’ ని ఆదివారం ఉదయం నిర్వహించాయి. డచ్‌ బంగ్లా నుంచి పర్యటన సాగే మార్గాలను జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, కేంద్ర హోంశాఖ, ఉప రాష్ట్రపతి సెక్రటేరియట్ అధికారులు సమీక్షించారు.

Read Also:Malapanagudi: మలపనగుడిలో తాగునీటి కష్టాలు.. చుక్క నీటి కోసం గ్రామస్తుల ఎదురుచూపులు!

Srikakulam: కేంద్ర అధికారుల పర్యవేక్షణ

ఈ పర్యటనలో ఉప రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన కీలక అధికారులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ ఆఫీసర్ అమిత్ శర్మ, అశుతోష్ లతో పాటు సిఆర్పిఎఫ్ 2 ఇన్ కమాండ్ (2ఐసి) ధర్మబీర్ జాకర్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా పోలీసు యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు.

 Vice President CP Radhakrishnan Srikakulam Visit

నగరంలోని మిల్ జంక్షన్ మీదుగా నేరుగా శ్రీకూర్మం చేరుకున్న బృందం, ఆలయ పరిసరాలను పరిశీలించింది. ఆలయ ప్రవేశ ద్వారం, ప్రాంగణం, గర్భాలయ పరిసరాలను కేంద్ర అధికారులు తనిఖీ చేశారు. ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికే పాయింట్ నుంచి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లే వరకు ప్రతి అడుగును భద్రతా కోణంలో విశ్లేషించారు. ఆలయ విశిష్టతను ఉప రాష్ట్రపతికి వివరించే తీరుపై ఈవోకు పలు సూచనలు చేశారు. అనంతరం అరసవల్లి క్షేత్రానికి చేరుకున్న అధికారులు, ప్రధాన రహదారి నుంచి ఆలయం వరకు ఉన్న మార్గాలను తనిఖీ చేశారు.

ఆలయ ప్రాంగణంలో పుష్పాలంకరణ, పారిశుధ్యం మెరుగుపరచాలని, వీవీఐపీ పర్యటన సమయంలో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా రద్దీని నియంత్రించాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వి.ఐ.పి.లు ఆలయానికి చేరుకునే మార్గంపై ప్రత్యేక నిఘా ఉండాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, ఆర్‌డీఓలు కె. సాయి ప్రత్యూష, కృష్ణమూర్తితో పాటు అరసవల్లి ఈవో ప్రసాద్ రావు, శ్రీకూర్మం ఈవో వాసు దేవరావు, అరసవెల్లి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, పలువురు జిల్లా అధికారులు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రంప్‌ కార్యక్రమం వద్ద కాల్పులు.. స్పందించిన ప్రధాని మోదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha