Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపేంద్ర కర్ణాటక సీఎం కావాలి.. తమిళనాడులో విజయ్ లాగే ఇక్కడా ఆదరించాలి!

ఉపేంద్ర కర్ణాటక సీఎం కావాలి.. తమిళనాడులో విజయ్ లాగే ఇక్కడా ఆదరించాలి!

వార్త 2 weeks ago

Shiva Rajkumar Comments On Upendra: తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ ద్వారా సాధిస్తున్న ఘన విజయాన్ని, అతనికి లభిస్తున్న ప్రజాదరణను శివరాజ్‌కుమార్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“పొరుగు రాష్ట్రంలో నటుడైన విజయ్‌ను అక్కడి ప్రజలు అంతలా ఓనర్‌గా స్వీకరించి ఆదరించినప్పుడు.. కర్ణాటకలో ప్రజాస్వామ్య మార్పు కోసం ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ (UPP) పెట్టి పోరాడుతున్న ఉపేంద్రకు మన ప్రజలు ఎందుకు అలాంటి మద్దతు ఇవ్వకూడదు?” అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఉపేంద్ర కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) కావాలని తాను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నటీనటులు కేవలం సినిమాల్లో మాత్రమే ముఖానికి రంగులు వేసుకుంటారని, నిజ జీవితంలో రంగులు మార్చకుండా అత్యంత నిజాయతీగా ఉంటారని శివరాజ్‌కుమార్ వ్యాఖ్యానించారు.

Read Also :Siddaramaiah Resign: సిద్దరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం

Shiva Rajkumar Comments On Upendra:సేవకు పబ్లిసిటీ అవసరం లేదు.. నాకైతే నో పొలిటిక్స్

 Shiva Rajkumar Wants Upendra to Become Karnataka CM; Cites Thalapathy Vijay’s Example

మంచి పనులు చేయడానికి ఎప్పుడూ వార్తాపత్రికల కవరేజ్ లేదా మీడియా పబ్లిసిటీ అవసరం లేదని శివరాజ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చేసే పనిలో నిబద్ధత ఉంటే ప్రజలు దాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారని, దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబం ఎప్పటి నుంచో ఎలాంటి ప్రచారం కోరుకోకుండా సామాన్యులకు గుప్తంగా సేవ చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, తనకు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి (Direct Politics) వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని శివరాజ్‌కుమార్ మరోసారి స్పష్టం చేశారు. తన అభిమానులు కూడా రాజకీయ రంగులతో సంబంధం లేకుండా సమాజంలో నలుగురికీ సాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha