IPL Match Tickets: ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో హై-వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా SRH, CSK జట్లు తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూడాలని తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆరాటపడుతున్నారు. టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎమ్మెస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సిరీస్ కానుందనే ప్రచారం జరుగుతుండడం ఒక కారణం అయితే.. గత మ్యాచ్‌లలో మహీ అదరగొట్టిన మెరుపులు మరో కారణం. దీంతో ఉప్పల్ మ్యాచ్ టికెట్ల కోసం మునుపెన్నడూ లేని విధంగా డిమాండ్ ఏర్పడింది.
Read Also : Hardik Pandya: హార్దిక్ పాండ్యకు భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 10% కోత!
Huge demand for Uppal match tickets..
IPL Match Tickets: క్షణాల్లో మాయం.. ఆన్‌లైన్ ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ
ఈ మ్యాచ్ టికెట్లను సొంతం చేసుకోవడానికి ఎంతో మంది అభిమానులు గంటల తరబడి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఆన్‌లైన్ అఫీషియల్ పార్టనర్ సైట్లలో ఉంచిన టికెట్లు లాంచ్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్లు (Sold Out) చూపిస్తుండడంతో అభిమానులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు టికెట్లు సైట్లోకి సాధారణ ప్రజలకు అందుబాటులోకి రాకముందే పక్కదారి పడుతున్నాయని, కేవలం క్షణాల్లోనే అన్నీ ఎలా మాయమవుతున్నాయని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధోనీ క్రేజ్‌తో కేటుగాళ్ల దందా
సాధారణ అభిమానుల టికెట్ల కష్టాలను అదునుగా భావించి బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు భారీగా రంగంలోకి దిగారు. స్టేడియంలో కనీస ధరగా ఉండే ₹1000 టికెట్‌ను ఏకంగా 6000 లకు పైనే విక్రయిస్తున్నట్లుగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మకానికి పెట్టారని, మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి విపరీతంగా బ్లాక్ టికెట్ల దందా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెస్ ధోనీ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకే ఈ లూటీ జరుగుతోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా.. ఈ సీజన్ ఐపీఎల్ అధికారిక టికెట్ల అమ్మాకాల డిజిటల్ బాధ్యతను బీసీసీఐ ‘పేటీఎం’ సంస్థకు అప్పగించిన సంగతి తెలిసిందే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
'మీరు అసహ్యంగా ఉన్నారు, మమ్మల్ని వదిలేయండి'.. సారా టెండూల్కర్

