Osmania Hospital:హైదరాబాద్‌లోని ప్రముఖ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లింగమార్పిడి (జెండర్ అఫర్మింగ్) చికిత్సల విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
గడిచిన 8 నెలల వ్యవధిలోనే ఏకంగా 19 లింగమార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి వైద్య రంగంలో అరుదైన మైలురాయిని చేరుకుంది.
Gender-affirming surgeries at no cost
ఉచితంగా సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ సేవలు
సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ అత్యంత క్లిష్టమైన సర్జరీలను, ఉస్మానియా ఆసుపత్రిలో పేషెంట్లకు ఎలాంటి ఆర్థిక భార పడకుండా సీఎంఆర్‌ఎఫ్ (CMRF) మరియు ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పూర్తిగా ఉచితంగా చేయడం విశేషం. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఖర్చయ్యే ఈ ఖరీదైన వైద్య సేవలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నారు. ముఖ్యంగా సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్లను సైతం సీఎంఆర్‌ఎఫ్ ఎన్‌ఎస్‌సీ ద్వారా రోగులకు సమకూర్చడం గమనార్హం.
Jawaharnagar Dumping Yard: డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్షకు సిద్ధం: మల్లారెడ్డి
Osmania Hospital:సర్జరీల వివరాలు
ఉస్మానియా ప్లాస్టిక్ సర్జరీ టీమ్ ఆధ్వర్యంలో స్త్రీ నుండి పురుషులుగా మారిన వారికి, పురుషుల నుండి స్త్రీలుగా మారిన వారికి వేర్వేరుగా మొత్తం 19 సర్జరీలు నిర్వహించారు:
- స్త్రీ నుండి పురుషుడిగా మారిన 9 మందికి నిపుల్ ఏరియోలా కాంప్లెక్స్ దెబ్బతినకుండా ఉస్మానియా డాక్టర్లు రొమ్ములను తొలగించి పురుషుడి ఛాతీలా మార్చే (మాస్టెక్టమీ) ఆపరేషన్ చేశారు.
- మరో ఇద్దరికి లాపరోస్కోపిక్ విధానంలో గర్భసంచి తొలగింపు శస్త్రచికిత్స నిర్వహించారు.
- పురుషుడి నుండి స్త్రీగా మారిన వారిలో ఇద్దరికి సిలికాన్ ఇంప్లాంట్స్‌తో, ఒకరిది గొంతులోని కొబ్బెర్తో రొమ్ముల పరిమాణం పెంచే సర్జరీలు చేశారు.
- మరొకరికి పురుషాంగాన్ని తొలగించి సమాజ యోనిని పునர்నిర్మించే (వైనోప్లాస్టి) సర్జరీ చేశారు.
- ఇంకా కొందరికి వృషణాల తొలగింపు (ఆర్కిడెక్టమీ), మరికొందరికి స్త్రీ రూపురేఖల కోసం హెయిర్‌లైన్ అడ్వాన్స్‌మెంట్, హెడ్ రిడక్షన్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు.
పాల్గొన్న వైద్య నిపుణులు
ఈ సంక్లిష్ట ప్రక్రియను అంతర్జాతీయ వైద్య నియమావళి ప్రకారం ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పడమట లక్ష్మి నేతృత్వంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ దివ్య, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ నాగభూషణం తదితరులు విజయవంతంగా నిర్వహించారు. వీరికి అనెస్తీషియా వైద్యులు డాక్టర్ సంధు నాయక్, డాక్టర్ మాధవి, ఎండోక్రైనాలజీ విభాగం నుండి ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాజేష్ సహాయ్, హెచ్‌ఐడీ డాక్టర్ నీలవేణి, యూరాలజీ, గైనకాలజీ, సైకియాట్రీ టీమ్ పూర్తి సహకారం అందించాయి. సర్జరీకి ముందే ట్రాన్స్‌జెండర్లకు సైకోథెరపీ, మానసిక కౌన్సిలింగ్, హార్మోన్ థెరపీలను నిర్వహించి, ఆ తర్వాతే సర్జరీలకు అనుమతిస్తున్నారు.
ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి
గత ఎనిమిది నెలల్లో 19 సర్జరీలను సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ ద్వారా 100 శాతం ఉచితంగా పూర్తి చేయడం పట్ల సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని తొలిసారి ఉస్మానియా ఆసుపత్రిలో జెండర్ అఫర్మింగ్ ఆపరేషన్లు, సీఎఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ ద్వారా వంద శాతం ఉచిత వైద్యం అందడం ట్రాన్స్‌జెండర్లకు ఒక వరం లాంటిది. హార్మోన్లతో ఇబ్బంది పడుతున్న వారు ఖరీదైన వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న వారు నేరుగా వైద్యుల వద్దకు వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని, ప్రభుత్వం ఏర్పాట చేసిన ఈ స్పెషల్ విభాగాన్ని ఆశ్రయించి ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

