Osmania Medical Student: ఉస్మానియా ఆసుపత్రిలో పీజి జనరల్ సర్జరీ ప్రథమ సంవత్సరం మెడికల్ విద్యను అభసిస్తున్న వైద్య విద్యార్థి ఆత్మ హత్యకు పాల్పడం పట్ల సంచలనంగా మారింది.
ఆసుపత్రి ప్రాంగణం పిజి వైద్య విద్యార్థుల వసతి గృహంలోని రూమ్లో 10 మాత్రలు, ఇంజెక్షన్ చేసుకోవడంతో ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న వైద్య విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి క్యాజువాల్టీకి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. పనిఒత్తిడి కుటుంబీలను కాదనలేక బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్దారించారు.
Read Also: Electricity Artisans Termination: విద్యుత్ ఆర్టిజన్ల తొలగింపు!
Medical student commits suicide in Osmania.. Was stress the reason?
బలవన్మరణానికి గల కారణాలు
పనిఒత్తిడి కుటుంబీలను కాదనలేక బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్దారించారు. తాను కోరుకున్నది పిజి జనరల్ మెడిసిన్, అయితే తొలిమలి, తృతీయ కౌన్సిలింగ్లలో కొరుకున్న విభాగంలో పిజి సీటు లభించలేదు. కుటుంబ సభ్యుల మాట కాదనలేక పిజి జనరల్సర్జరీలో చేరినా పని ఒత్తిడి, ఆత్మన్యూనతా భావన లోకి లోనయ్యారు.
యువ వైద్యా విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించాడు. ఓపి భవనంలో క్యాజువాల్టీలో నుంచి పోస్టుమార్టం కోసం మార్చురీకి శవాన్ని తరలించకుండా కుటుంబీకులు అడ్డుకున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేసేది లేదంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రికత్త నెలకొంది. భారీగా పోలీసులు మెహరింప చేశారు. ఈ కేసును అఫ్టల్గంజ్ ఇన్స్పెక్టర్ మోహన్రావు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

