Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి కన్నుమూత

ఉత్తరాఖండ్ మాజీ సీఎం భువన్ చంద్ర ఖండూరి కన్నుమూత

వార్త 5 days ago

Bhuwan Chandra Khanduri death: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి భువన్ చంద్ర ఖండూరి సుదీర్ఘ అస్వస్థతతో మంగళవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 91 సంవత్సరాలు.

మాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో ప్రముఖ నేతగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఖండూరి మృతితో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నారు.

Read Also : Submarine Cables: టెక్ దిగ్గజాలకు ఇరాన్ షాక్: సముద్రగర్భ కేబుళ్లపై కన్నేసిన ఆర్మీ

 Former Uttarakhand CM Bhuvan Chandra Khanduri passes away

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతగా ఖండూరి 2007 నుంచి 2009 వరకూ, తిరిగి 2011 నుంచి 2012 వరకూ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2009లో రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేశారు. 2011లో ఆయనను తిరిగి సీఎంగా పార్టీ నియమించింది. కేంద్ర మంత్రిగా కూడా ఖండూరి పనిచేశారు.

Bhuwan Chandra Khanduri death: ఖండూరి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం.

చంద్ర ఖండూరి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలియజేశారు. భారత సైన్యంలో మేజర్ జనరల్‌గా, ఆ తర్వాత రాజకీయరంగంలో ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని అన్నారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తన సంతాప సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha