Dailyhunt
ఉత్తరం వైపు రీజినల్ రింగ్ రోడ్డుకు వేగంగా భూసేకరణ

ఉత్తరం వైపు రీజినల్ రింగ్ రోడ్డుకు వేగంగా భూసేకరణ

వార్త 3 weeks ago

Telangana RRR Acquisition: రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర దిశవైపు భూసేకరణ కోసం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికార యంత్రాంగం వేగం పెంచింది.

సంగారెడ్డి జిల్లాలో శివంపేట, వెండికోలు, లింగంపల్లి, వెంక టకిష్పాటూర్ కోర్పోలు, గ్రామాలతో పాటు, సిద్దిపేట జిల్లాలోనిజగదేవ్ పూర్, మర్కూక్ మండలాలు, భువ నగిరి మండలం మినహా మిగిలిన అన్ని మండలాల్లో భూ సేకరణ కొలిక్కి వచ్చింది. త్రిపులార్ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నా రు. రైతులకు నచ్చజెప్పి భూములు ఇప్పించే పనిలో ఉన్నారు.

Read Also: TG High Court: పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా

 Regional ring road north land acquisition speed up telangana

Telangana RRR Acquisition: జిల్లా వారీగా సేకరణ వివరాలు

ఉత్తర భాగంలో సంగారెడ్డి, మెదక్ సిద్దపేట, యాదాద్రి భువనగరి జిల్లాల మీదుగా సుమారు 164 కిమీ మేర ట్రిపుల్ ఆర్ వెళ్లనుంది. భూముల సేకరణ కోసం ఆయా జిల్లాలో వేగం పెంచడమే కాకుండా సెలవురోజుల్లో కూడా రైతులతో సమా వేశాలు నిర్వహించి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో శివంపేట, వెండికోలు, లింగంపల్లి, వెంకట కిష్పాటూర్ కోర్పోలులో ఏప్రిల్ 3న శుక్రవారం 298.23 ఎకరాల భూములు కోల్పోతున్న 581 మంది రైతులకు నోటిసులు జారీచేసి నచ్చచెప్పారు.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో మార్చి 16న జగదేవ్ పూర్, మర్కూక్ మండలాల పరిధిలోని చెబర్తి, అలిరాజ్పేట, పీర్ల పల్లి, ఇటిక్యాల గ్రామాల రైతులతో ఆర్బిటరేషన్ ప్రక్రియ గురించి నిర్వహించి రైతులను ఒప్పించడానికి కలెక్టర్ కూడా ప్రత్యక్షంగా భూ నిర్వాసితులతో సమావేశమైనారు.

యాదాద్రి జిల్లాలో పరిహారం చెల్లింపు

యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం రాయ గిరి, చౌటుప్పల్లో జంక్షన్లు రాను న్నాయి. ఇందుకోసం 2,588 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లిలో ప్రారంభయ్యే రీజినల్రంగ్ రోడ్ యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మీదుగా వెళ్తుంది. యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల భూ సేకరణ క్రతువు దాదాపు పది అంకానికి చేరుకుంది. 19.19 కి.మీ.కు 540 ఎకరాలు సేకరించి అవార్డు కూడా పాస్ చేశారు. మల్లాపూర్లో పెండింగ్లో ఉంది. 290 ఎకరాలు సేకరించి 674 మంది రైతులకు రూ.57 కోట్లు చెల్లించారు. మిగిలిన వారికి పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు గౌస్నగర్, ఎర్రంబల్లిలో 484 ఎకరాల సేకరణ జరగాల్సి ఉంది. కోర్టు కేసుతో ఆగింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా రైతులు అభ్యంతరం చెప్పడంతో ఆగింది. ప్రస్తుతం కేసారం, పెంచికలపహాడ్లో సర్వే పూర్తయ్యింది. అవార్డు కూడా పాస్ చేశారు.

పరిహారం పెంపు అభ్యర్థనలు

రాయగిరి మినహా మిగిలిన మండలాల్లో సర్వే కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా రైతులకు డబ్బులు చెల్లించలేదు. వలిగొండ, చౌటుప్పల్ పరిధిలో 25.47 కిమీ రహదారి కోసం భూసేకరణ వేగంగా సాగుతోంది. ఈ రెండు మండలాల్లో 983 మంది రైతుల నుంచి 784 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటికే 118 ఎకరాలకు అవార్డు పాస్ చేసి 361 మంది రైతులకు రూ.64 కోట్లు చెల్లించారు. సుమారు 2,588 మంది రైతుల నుంచి సుమారు రెండు వేల ఎకరాలు సేకరించాలని ఎన్హెచ్ఎఐ అధికారులు అభ్యర్ధన ఇచ్చారు. 1289 ఎకరాలకు రూ.532 కోట్ల పరిహారం చెల్లించేందుకు అవార్డు పాస్ చేశారు. ఇప్పటి వరకు 409 ఎకరాలకు 1035 మంది రైతులకు రూ.121.46 కోట్ల పరిహారం వారి ఖాతాల్లో జమ చేశారు.

ప్రాజెక్టు అంచనాలు

ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కింద రూ.15,627 కోట్ల అంచనా వ్యయంతో సంగారెడ్డి నుంచి నర్సాపూరూప్రాన్ గజ్వేల్ యాదగిరిగుట్ట చౌటుప్పల్ వరకు సుమారు 160 కిలోమీటర్ల మేర హ్యామ్ విధానంలో ఆరు లేన్ల రహదారిని ఐదు ప్యాకేజీల్లో నిర్మించాలని నిర్ణయించారు. రహదారి నిర్మాణంలో భూసేకరణ పెద్ద సమస్యలా మారింది. ఉత్తరభాగంలో 1918.50 హెక్టార్లు సేకరించగా 1597.62 హెక్టార్లకు అవార్డు కూడా అయింది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియ ఎటూతేలకపోవడం వల్లే ప్రాజెక్టు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి.

భవిష్యత్ కార్యాచరణ

పార్లమెంటరీ కమిటీ దేశంలో ప్రాజెక్టులు నిలిచిపోకుండా భూసేకరణ పూర్తి అయిన తరువాతనే చేపట్టాలని ఎక్కడా 100 శాతం భూసేకరణ పూర్తికాకుండా ప్రాజెక్టులు చేపట్టరాదని సూచించింది. ప్రాజెక్టులు మధ్య లో నిలిచిపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి వృథా కావడమే కాకుండా అంచనా వ్యయం భారీగా పెరుగుతుందని, దీనివల్ల కొత్త తలనొప్పులు తలెత్తుతాయని తేల్చింది. ట్రిపుల్ ఆర్ పనులు చేపట్టే విషయంలో ఎన్హెచ్ఎఐ తొందర పడటంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉత్తర దిశ త్రిపులార్ ఎకరా 50 లక్షలు కనిష్ఠంగా ధర ఉండటంతో భూ నిర్వాసిత రైతులు మార్కెట్ ధరకు అనుకూలంగా పరిహారం కోరుతున్నారు కానీ ప్రభుత్వం నష్టపరిహారం పెంచే పరిస్థితిలో లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు ఇప్పట్లో ముందుకు సాగే అవకాశం లేదని అధికారవర్గాలు స్పష్టంచేస్తున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అగ్రికల్చర్ వర్సిటీలో ఎసిబి అధికారుల దాడులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha