తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి
Telangana Seed Development Corporation: వానాకాలం సాగు కోసం 4 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి ఆదేశించారు.
వ్యవసాయ శాఖ నిర్దేశించిన వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించి ఆయా రకాలకు అవసరమైన విత్తనాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ అధికారులతో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
Read Also: Telangana Agriculture: రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు.. మంత్రి తుమ్మల
Seeds are ready for monsoon cultivation
Telangana Seed Development Corporation: పంటల విత్తనాల సరఫరాపై చర్చ
ఈ సందర్భంగా రానున్న వానాకాలం సీజన్కు సంబంధించి రాష్ట్రంలో సాగయ్యే ప్రధాన పంటలైన వరి, కంది, పెసర, మినుము పచ్చిరొట్ట విత్తనాల సరఫరాపై విసృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల ఎకరాల్లో వరి సాగు అంచనా నేపథ్యంలో సుమారు 15 లక్షల క్వింటాళ్ల విత్తన అవసరమవుతాయని, ఇందులో 4 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందు బాటులో ఉంచనుంద న్నారు. అదే సమయంలో ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మండలాల వారీ సరఫరా
వ్యవసాయశాఖ ద్వారా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు 1.04 లక్షల క్వింటాళ్ల ఇండెంట్ అందిన నేపథ్యంలో రానున్న రెండు వారాల్లో అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా పంట మార్పిడిలో భాగంగా ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం పథకం కింద రాయితీపై సరఫరా చేస్తున్న కంది, పెసర, మినుము విత్తనాలను మే నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని మండలాలకు చేర్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి మేనేజర్లు, ప్రాంతీయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

