Mana Mitra Senior Citizen Cards: మన మిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని వయో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని వయో వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.
వెలగపూడి సచివాలయంలో మంత్రి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వయోవృద్దుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై సమావేశంలో మంత్రి సమీక్షించారు.
Read Also : Anantapur Crime: ఏ పాపం తెలియని చిన్నారిని బలి తీసుకున్న బావ!

Mana Mitra Senior Citizen Cards: సైబర్ నేరాల పట్ల వృద్ధులకు అవగాహన కల్పించాలి
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనమిత్ర వాట్సాప్ ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందజేస్తున్నాం. అర్హులైన వారందరికి ఈ కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలి. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. వృద్ధా శ్రమాల్లో లైట్ వెయిట్ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలి, ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్ కార్యాలయాల్లో లిఫ్ట్ సౌకర్యంతోపాటు వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధులు, దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్దమొత్తంలో ఫించన్లు ఇస్తున్నాం.
2036నాటికి రాష్ట్రంలో ప్రతి 5మందిలో ఒకరు వృద్ధుడు ఉంటారు. దీన్ని అధిగమించేందుకే సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకీ శ్రీకారం చుడుతున్నారు. వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. కార్యక్రమంలో ఐఏఎస్ సూర్యకుమారి, డైరెక్టర్ రవి ప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఏపీ ఆస్తిపన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్.. వడ్డీలో 50% రాయితీ

