Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వచ్చే నెల నుంచి మారుతి కార్ల ధరల పెంపు

వచ్చే నెల నుంచి మారుతి కార్ల ధరల పెంపు

వార్త 2 days ago

Maruti Suzuki Car Price Hike: సొంత కారు కొనాలనుకునే మధ్యతరగతి వాహనదారులకు దేశీయ కార్ల మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఊహించని షాక్ ఇచ్చింది.

వచ్చే నెల (జూన్) నుంచి తమ శ్రేణిలోని అన్ని మోడళ్ల వాహనాల ధరలను పెంచుతున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. నిత్యావసరాలు, వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, ప్రతికూల వ్యయ వాతావరణం మరియు నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్పష్టం చేసింది.

Read Also :Gold Price Today : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తులం రేటు షాకింగ్ స్థాయికి

 Maruti Suzuki India has announced that it will increase the prices of all its cars starting June 1.

ఈ ధరల పెంపు అనేది ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి మారుతుందని, గరిష్టంగా రూ. 30,000 వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది. గత కొన్ని నెలలుగా ఉత్పత్తి వ్యయ భారాన్ని సంస్థే భరిస్తూ, వినియోగదారులపై ప్రభావం పడకుండా శతవిధాలా ప్రయత్నించామని.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ భారంలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదిలీ చేయక తప్పడం లేదని మారుతి సుజుకి వెల్లడించింది.

1.9 లక్షల ఆర్డర్లు పెండింగ్.. 'ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్' అలర్ట్

గత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ వద్ద సుమారు 1.9 లక్షల కస్టమర్ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చే చిన్న కార్ల సెగ్మెంట్‌కు (ఆల్టో, వ్యాగన్-ఆర్ వంటివి) చెందిన ఆర్డర్లే దాదాపు 1.3 లక్షల వరకు ఉండటం గమనార్హం. ఉత్పత్తి సమస్యల (Production Issues) కారణంగా సకాలంలో కార్లను డెలివరీ చేయలేకపోయినందుకు, ఈ ఏడాది జనవరిలో బుక్ చేసుకున్న కస్టమర్ల కోసం కంపెనీ ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఆయా కస్టమర్ల కోసం 'ప్రైస్ ప్రొటెక్షన్ స్కీమ్'ను (Price Protection Scheme) అమలు చేయనుంది. దీనివల్ల పాత బుకింగ్స్ ఉన్నవారికి ఈ ధరల పెంపు వర్తించకపోవచ్చు.

Maruti Suzuki Car Price Hike: గతేడాది భారీ తగ్గింపు.. ఇప్పుడు మళ్లీ పెంపు

గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 (GST 2.0) అమలులోకి తెచ్చిన తర్వాత మారుతి సుజుకి తన పాపులర్ మోడళ్ల ధరలను భారీగా తగ్గించి మిడిల్ క్లాస్ కస్టమర్లను ఆకట్టుకుంది. అప్పట్లో:

  • ఎస్-ప్రెస్సో (S-Presso): రూ. 1,29,600 వరకు తగ్గింపు
  • ఆల్టో K10 (Alto K10): రూ. 1,07,600 వరకు తగ్గింపు
  • సెలెరియో (Celerio): రూ. 94,100 వరకు తగ్గింపు
  • వ్యాగన్-ఆర్ (Wagon-R): రూ. 79,600 వరకు తగ్గింపు లభించింది.

అయితే గతేడాది లభించిన ఆ భారీ ఉపశమనం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుత మార్కెట్ వ్యయాల పెంపుదల కారణంగా వచ్చే నెల జూన్ 1, 2026 నుండి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. కాబట్టి కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నవారు ఈ నెలాఖరు లోపు కొనుగోలు చేయడం ఉత్తమం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

50 వసంతాల 'మాజా' మ్యాంగో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha