Joginapally Santosh Kumar:పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై పోరాటం విషయంలో భారతదేశంలో అద్భుతమైన విధానాలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు?
కచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ రాజ్యసభసభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం బెంగళూరులోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎంబి) వేదికగా జరిగిన క్లైమేట్ ఇన్నోవేషన్ సమిట్ 2026లో ఆయన ప్యానెల్ స్పీకర్గా పాల్గొని పలు కీలక అంశాలను లేవనెత్తారు. సదస్సులో సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో రూపొందించే ప్రభుత్వ విధానాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న తెలంగాణ రైతుకు లేదా కర్ణాటక విద్యార్థికి మధ్య ఉన్న అగాధమే మన ముందున్న అతిపెద్ద సవాలు’ అని వ్యాఖ్యానించారు.
Read also: Telangana RTC News: TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న విలీనంపై కీలక నిర్ణయం!
Heatwaves should be declared a national disaster.
ఎటువంటి ప్రభుత్వ సర్క్యులర్లు లేకుం డానే, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా 4.4 కోట్ల మంది భాగస్వామ్యంతో 19.6 కోట్ల మొక్కలు నాటడాన్ని ఆయన ఉదాహరణగా చూపిస్తూ, పర్యావరణ పోరాటం అనేది ఒక ప్రజల ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ఎప్పుడూ లేని విధంగా 2026 ఏప్రిల్ నెలలో 6 నగరాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయని సంతోష్ కుమార్ గుర్తుచేశారు. వరదలు, భూకంపాల కంటే కూడా వడగాల్పుల వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోందని, అయినప్పటికీ ఎస్ఆర్ ఎఫ్/ఎన్టీఆర్ఎఫ్ నిధుల పరిధిలో వడగాల్పులను విపత్తుగా గుర్తించకపోవడం ప్రభుత్వ విధానాల వైఫల్యమని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకునేలా అన్ని రాష్ట్రాలు ఒత్తిడి తేవాలని కోరారు. భారతదేశం కొత్తగా తీసుకొస్తున్న కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ కేవలం బడా కార్పొరేట్ సంస్థలకే పరిమితం కాకూడదని సంతోష్ కుమార్ సూచించారు. పర్యావరణాన్ని కాపాడే స్థానిక పంచాయతీలు, కమ్యూనిటీ ఆధారిత ప్రాజెక్టులకు కూడా కార్బన్ మార్కెట్లో పాల్గొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
Joginapally Santosh Kumar:అద్భుతమైన పర్యావరణ ప్రాజెక్టులు
అలాగే దేశంలోని ప్రతి కాలేజీ క్యాంపన్ను ఒక క్లైమేట్ గవర్నెన్స్ యూనిట్గా మార్చాలని పిలుపునిచ్చారు. భారతదేశంలోనే తొలిసారిగా ఒక క్లైమేట్ సదస్సును కార్బన్నెగెటివ్ ఈవెంట్గా మార్చిన ఘనతను గ్రీన్ ఇండియా ఛాలెంజ్
దక్కించుకుంది. సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరి పేరుతో పునర్వసు ప్రాజెక్ట్ కింద జియోట్యాగ్ చేయబడిన వెదురు
మొక్కలను నాటారు. సాధారణ చెట్ల కంటే వెదురు నాలుగు రెట్లు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని, 35 ఎక్కువ ఆక్సిజన్ను ఇస్తుంది. ఈ మొక్కల పెంపక బాధ్యతను 1,000 రోజుల పాటు తమ సంస్థ తీసుకుంటుందని సంతోష్ కుమార్ ప్రకటించారు. 2026 డిసెంబర్లో హైదరాబాద్ హెచ్ఐసిసి వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక హైదరాబాద్ క్లైమేట్ యాక్షన్ వీక్కు విచ్చేయాల్సిందిగా సదస్సు భాగస్వాములందరినీ సంతోష్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ లాభాపేక్షలేని సంస్థ. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో, మాజీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ఈ సంస్థ 33 దేశాల్లో 22 వేలకుపైగా వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

