Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైట్ హౌస్ వద్ద సాయుధ దుండగుడి కాల్పులు: ఆందోళనలో భద్రతా విభాగాలు

వైట్ హౌస్ వద్ద సాయుధ దుండగుడి కాల్పులు: ఆందోళనలో భద్రతా విభాగాలు

వార్త 3 weeks ago

మెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్ హౌస్ సమీపంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన కీలక వివరాలు ఇలా ఉన్నాయి. వాషింగ్టన్ డీసీలోని 15వ వీధి, ఇండిపెండెన్స్ అవెన్యూ సమీపంలో ఒక అనుమానిత వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు గుర్తించారు.

అధికారులను చూడగానే ఆ వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కాల్పులకు తెగబడ్డాడు.

Read Also: Iran War: ముంచుకొస్తున్న ముడి చమురు ధరల ముప్పు..కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ

 Shooting At White House

Shooting At White House: ప్రతికాల్పులు

భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి జరిపి ప్రతికాల్పుల్లో సాయుధ దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్లడం గమనార్హం. ఘటన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నారు. దుండగుడు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల మధ్యలో చిక్కుకుని ఒక చిన్న బాలుడు గాయపడ్డాడు. అయితే ఆ బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు లాక్‌డౌన్ విధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha