Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వనదేవతల సన్నిధిలో కొత్త పింఛన్లు

వనదేవతల సన్నిధిలో కొత్త పింఛన్లు

వార్త 1 week ago

CM Revanth Reddy:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. గద్దెల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఒంటరి మహిళలు వితంతువుల కోసం ఉద్దేశించిన చేయూత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. పలువురు మహిళలకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు.

Read also: SPOs Recruitment: SPO పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

 Launch of Cheyutha pensions in Medaram

వనదేవతలకు సీఎం ప్రత్యేక పూజలు

ములుగు జిల్లా మేడారంలో పూజారులు గిరిజన సంప్రదాయాల నడుమ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం చీర సారె పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వన దేవతల సమక్షంలో సీఎం మంత్రులకు సీతక్క రాఖీలు కట్టారు.

CM Revanth Reddy:మహిళలతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా ముచ్చట

మేడారం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొక్కలు నాటారు. మహిళలతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ పర్యటన ద్వారా స్థానిక ప్రజలకు ప్రభుత్వం నుంచి మెరుగైన సంక్షేమ పథకాలు అందుతున్నాయని స్పష్టమైంది.

Epaper: epaper.vaartha.com

నాగోల్‌లో 72 అడుగుల మట్టి గణపతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha