Vande Bharat New Rules: రైల్వే ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటూ, దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న 'వందే భారత్' ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ సరికొత్త నిబంధనలను, అత్యవసర మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే ఈ రైలులో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు వీలుగా అధికారులు ఈ కీలక సూచనలు చేశారు.
వందే భారత్ రైళ్లలో మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్ల వ్యవస్థ ఉంటుంది. ఒకవేళ రైలు కదిలే సమయంలో ఈ ఆటోమేటిక్ డోర్లు మూసుకుపోతే, ప్రయాణికులు కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువంటి సమయంలో రైలు వెనుక భాగంలో ఉండే గార్డ్ కోచ్ ద్వారా ప్రయాణికులు సులభంగా లోపలికి ప్రవేశించేందుకు వీలుంటుందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
Read Also : America-Iran War: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో మళ్ళీ చమురు మంటలు
Don’t be alarmed if the doors close on the Vande Bharat-here’s what to do!
Vande Bharat New Rules: స్టేషన్‌లో దిగడం మర్చిపోతే.. ‘టాక్-బ్యాక్’ సిస్టమ్ ద్వారా అలర్ట్!
రైలు ప్రయాణంలో ఒక్కోసారి ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేషన్‌లో అనుకోకుండా దిగలేకపోతుంటారు. అలాంటప్పుడు డోర్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్’ (Emergency Talk-Back System) ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని ద్వారా లోపల ఉండే రైల్వే సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేయవచ్చు. ఒకవేళ ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్ దాటిపోతే, వెంటనే రైల్లోని టీటీఈ (TTE)ని సంప్రదించి, తదుపరి ప్రయాణం లేదా దిగాల్సిన విధానంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
బలవంతంగా డోర్లు తెరిస్తే చట్టరీత్యా నేరం
రైలు ప్రయాణంలో భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని రైల్వే శాఖ హెచ్చరించింది. ప్రయాణికులు అత్యవసర సమయాల్లో మినహా సాధారణంగా అలారం చైన్ లాగడం లేదా మూసుకున్న ఆటోమేటిక్ డోర్లను బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలతో పాటు భారీ జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు.

