US-Iran Tensions : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిముఖ్యమైన హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్యం నిలిచిపోవడంతో భారత్ అప్రమత్తమైంది.
భారత్ దిగుమతి చేసుకునే ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (LPG)లో సుమారు 90 శాతం వాటా ఈ కీలక జలమార్గం గుండానే రవాణా అవుతుండటంతో.. దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని తమ గరిష్ఠ సామర్థ్యానికి పెంచాలని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రిఫైనరీలకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆగస్టు 13 నాటి నోటిఫికేషన్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం తన మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో దాదాపు మూడింట రెండు వంతుల అవసరాలకు విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది.
Read Also: Annamalai Comments: తమిళనాడు ప్రతిపక్షాలపై అన్నామలై విమర్శలు
US-Iran Tensions
US-Iran Tensions : ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన నూతన నిబంధనల ప్రకారం..
అయితే యుద్ధం కారణంగా సంప్రదాయ సరఫరా మార్గాలకు అంతరాయం కలగడంతో.. భారత్ ఇప్పటికే అమెరికా, అల్జీరియా వంటి కొత్త సరఫరాదారుల వైపు మళ్లింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఈ సవాళ్లను అధిగమించేందుకు దేశీయంగా సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమయ్యే అన్ని చర్యలను తక్షణమే అమలు చేయాలని రిఫైనరీలు, ముడి చమురు అన్వేషకులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా నాఫ్తా వంటి పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లను సాధారణ అవసరాలకు వాడకుండా.. వాటిని ఎల్‌పీజీ ఉత్పత్తికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలనే వ్యూహాన్ని అమలు చేయాలని సూచించింది. యుద్ధ వాతావరణానికి ముందు భారత్‌లోని రిఫైనరీలు రోజుకు సుమారు 36 వేల టన్నుల ఎల్‌పీజీని ఉత్పత్తి చేసేవి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా డిమాండ్‌ను తట్టుకోవడానికి కంపెనీలు ఇప్పటికే ఈ ఉత్పత్తిని రోజుకు 54 వేల టన్నులకు పెంచాయి. అయితే ప్రభుత్వం తాజాగా నిర్దేశించిన నూతన నిబంధనల ప్రకారం దేశీయ చమురు పరిశ్రమ రోజుకు ఏకంగా 63,810 టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పుంజుకోవాలని లక్ష్యంగా విధించింది.
Epaper: epaper.vaartha.com
'దిమాగీ నక్సల్' వ్యాఖ్యల వివాదం..సోషల్ మీడియాలో కొత్త అకౌంట్

