Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వర్షాల నేపథ్యంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వార్త 2 weeks ago

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వివిధ విభాగాల మధ్య పరస్పర సమన్వయాన్ని మరింత పెంపొందించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

 CM Revanth Reddy Review Meeting

Read also: Bhatti Vikramarka: సాలార్‌జంగ్ మ్యూజియం హైదరాబాద్ స్ఫూర్తికి ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి

శాఖల మధ్య సమన్వయ లోపంపై ముఖ్యమంత్రి అసంతృప్తి

జూన్ 1న నిర్వహించిన ముందస్తు సమీక్షా సమావేశంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ, జూన్ 9న కురిసిన వర్షాల సమయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని, కొందరు అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసే సమయంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్ శాఖలకు చెందిన ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని కరాఖండిగా చెప్పారు.

Revanth Reddy: “నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. అవసరమైతే నేనే వస్తా”

“వరదలు లేదా ట్రాఫిక్ గందరగోళం తలెత్తినప్పుడు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. అవసరమైతే నేనే స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిస్థితులను తనిఖీ చేస్తాను” అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దీంతో పాటు ట్రాఫిక్ నియంత్రణలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సీఎం నిర్వహించిన ఈ సమీక్ష అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై తెలంగాణ సర్కార్ ఫోకస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha