Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వర్షం ఎఫెక్ట్.. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆలస్యం

వర్షం ఎఫెక్ట్.. ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ ఆలస్యం

వార్త 3 months ago

వర్షం కారణంగా ఆలస్యమైన మ్యాచ్

RCB vs KKR : రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2026 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన కీలక పోరు ఇంకా ప్రారంభం కాలేదు.

షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం కురవడంతో ఔట్‌ఫీల్డ్ పూర్తిగా తడిసిపోయింది. దీంతో రాత్రి 7 గంటలకు జరగాల్సిన టాస్‌ను నిర్వాహకులు వాయిదా వేశారు.

మైదానంలో పనులు ప్రారంభించిన సిబ్బంది

ప్రస్తుతం వర్షం పూర్తిగా ఆగిపోయింది. దీంతో గ్రౌండ్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మైదానాన్ని ఆరబెట్టే పనులు ప్రారంభించారు. పిచ్‌పై కప్పిన కవర్లపై నిలిచిన నీటిని తొలగిస్తూ ఔట్‌ఫీల్డ్‌ను ఆటకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంపైర్లు రోహన్ పండిట్, నితిన్ మీనన్ కూడా మైదాన పరిస్థితిని పరిశీలించారు. ఆట నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అనే దానిపై వారు సమీక్ష నిర్వహించారు.

Read Also:Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు.. సిక్సర్లే కాదు పుల్కాలు కూడా!

 RCB vs KKR

రాత్రి 8:15కు పిచ్ తనిఖీ

స్టేడియంలోని జెయింట్ స్క్రీన్‌పై ఇచ్చిన సమాచారం ప్రకారం రాత్రి 8:15 గంటలకు అంపైర్లు మరోసారి పిచ్‌ను తనిఖీ చేయనున్నారు. ఆ తనిఖీ అనంతరం మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో లేదా ఓవర్లు తగ్గిస్తారా అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈలోగా స్టేడియంలో మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులను ప్రముఖ గాయని కనికా కపూర్ తన పాటలతో అలరిస్తున్నారు. వర్షం కారణంగా ఆలస్యం జరిగినప్పటికీ ప్రేక్షకుల్లో ఉత్సాహం మాత్రం తగ్గలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కోహ్లీపై అబద్ధాలు చెప్పమన్నారు.. లిజ్‌లాజ్ షాకింగ్ కామెంట్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha